
మిరుదొడ్డి మండలం అందె గ్రామంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సామాజిక సమరసతా వేదిక, చైతన్య గ్రామీణ వికాస సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవాలలో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సమరసతా వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు . శివరాత్రి మహత్యాన్ని ఈ సందర్భంగా వారు భక్తులకు వివరించారు . శివ పార్వతుల కళ్యాణం లోక కళ్యాణంగా అభివర్ణిస్తూ మార్గదర్శనం చేశారు. పంచభూతాల సమ్మేళనమే మానవ జన్మని, దాన్నిసార్థకం చేసుకోవడం మన అదృష్టం అన్నారు . గత ఆరు సంవత్సరాలుగా అందె గ్రామంలో సమరసతా వేదిక ఆధ్వర్యంలో మహా శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో ప్రదర్శించిన ఏకపాత్రాభినయం, శివ నామస్మరణతో మార్మోగిన నృత్యాలు ఆద్యంతం గ్రామస్తులను కట్టిపడేశాయి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పలువురు ప్రముఖులను శాలువాతో సత్కరించి, మెమొంటో లను అందజేయడం జరిగింది.


