
దొరలు, సంస్థానాధిపతులు అనగానే అరాచకత్వం, దాష్టికానికి పాల్పడినవారనే అభిప్రాయం ఏర్పడిపోయింది…కానీ అందుకు విరుద్ధంగా గిరిజనులతో మమేకమై వారి సమస్యలు, వనవాసీల హక్కుల కోసం, సంస్కరణలకోసం వారిలో ఒకరిగా పోరాడిన నాయకుడు ప్రవీర్ చంద్ర భంజ్ దేవ్. ఇతని గురించి చాలా మందికి తెలియదు. లక్షలాది మంది బస్తర్ వనవాసీల ఆరాధ్యదైవం అతడు. కాకతీయ రాజ వంశీకులలో చిట్ట చివరివాడు, బస్తర్ రాజు అయిన ప్రవీర్ చంద్ర , వనవాసీ గిరిజనుల కోసం ప్రాణ త్యాగం చేసాడు.