Home News ఆర్.ఎస్.ఎస్ శాఖను ఆపేందుకు ప్రయత్నించిన సిపిఎం దుండగులు

ఆర్.ఎస్.ఎస్ శాఖను ఆపేందుకు ప్రయత్నించిన సిపిఎం దుండగులు

0
SHARE

ప్ర‌శాంతంగా, శాంతియుతంగా జ‌రుగుతున్న ఆర్‌.ఎస్‌.ఎస్ శాఖ‌ను కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPM), డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (DYFI)కి చెందిన కొంతమంది దుండ‌గులు అడ్డుకోవ‌డానికి య‌త్నించారు. కేర‌ళ‌లోని మలప్పురం జిల్లా కొట్టక్కల్‌లో ఫిబ్రవరి 6న రాత్రి ఈ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. శాఖ ముగింపు స‌మ‌యంలో నమస్తే సదా వత్సలే మాతృభూమి…. అంటూ ప్రార్థ‌న చేసే స‌మ‌యంలో దుర్మార్గులు వ‌చ్చి దౌర్జ‌న్యం చేశారు. అయినా వారిని ప‌ట్టించుకోకుండా, శాఖ‌కు అంత‌రాయం క‌ల‌గ‌నివ‌కుండా స్వ‌యంసేవ‌కులు సంఘ ప్రార్థ‌న పూర్తి చేశారు.

శాఖ‌ను ఆప‌డానికి వ‌చ్చిన దుండ‌గ‌డులు రెచ్చగొట్టే నినాదాలు చేశారు. “శాఖ‌ను ఆపకుంటే మేము మీ చేతులు కాళ్ళను నరికి సమీపంలోని కాలువకు విసిరివేస్తాము.” అని బెదిరించారు.

BIP మండల ప్రధాన కార్యదర్శి, ప్రాంతంలోని సీనియర్ స్వయంసేవక్ జయన్ తేలపురత్‌తో ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ, ప్రైవేట్ దేవస్వం ఆధ్వర్యంలోని ఆల‌య నిర్వ‌హ‌కుల పూర్తి అనుమతితో ఇక్కడ RSS శాఖ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా శాఖను ఆపమని సంఘ్ స్వయంసేవకులను అడిగే అధికారం లేదా హక్కు ఏ రాజకీయ పార్టీకి లేదా బయటి ఏజెన్సీకి లేద‌ని ఆయ‌న అన్నారు. ఎంత‌టి స‌మ‌స్య వ‌చ్చినా స్థానిక స్వయంసేవకులు శాఖ పనితో ముందుకు సాగాలని సంకల్పించారు.

ఈ ఘటనపై ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేరళలోని మలప్పురం వంటి హిందూ మైనారిటీ జిల్లాలో ముస్లింలను బుజ్జగించే కమ్యూనిస్ట్ విధానంలో ఈ చ‌ర్య‌ భాగమని వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జాతీయవాద శక్తులను రెచ్చగొట్టడం, ఇబ్బందులు, భౌతిక ఘర్షణలు సృష్టించడం, ఆపై లౌకికవాదం ప్రమాదంలో పడిందని ఏడ్చే విలక్షణమైన సిపిఎం పద్ధతి ఈ సంఘటన ద్వారా తేట‌తెల్ల‌మవుతుంది. ముస్లిం మెజారిటీ ఉన్న జిల్లాలో ముస్లిం ఓటు బ్యాంకు రాజ‌కీయాలు చేయ‌డం ఇది ఒక పద్ధతి. మ‌రో వైపు చట్టవిరుద్ధమైన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI), దాని రాజకీయ విభాగమైన SDPI ని సంతృప్తి ప‌రిచే చ‌ర్య అని కూడా చెప్ప‌వ‌చ్చు.