సంఘ కార్య విస్తరణకు సమాజం పట్ల ప్రేమ, శ్రమించే తత్వం ప్రధాన సాధనాలు. మన లక్ష్యమైన దేశ పరమవైభవాన్నిసాధించడానికి ప్రతి కార్యకర్త సమర్పణ భావంతో సమయాన్నికేటాయించి పని చేయాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచలాక్ డా మోహన్ భాగవత్ స్వయంసేవకులకు మార్గదర్శనం చేశారు.
ఆర్.ఎస్.ఎస్ తెలంగాణ అద్వర్యంలో హైదరాబాద్ శివార్లలో మూడు రోజుల పాటు జరిగిన ‘విజయ సంకల్ప శిబిరం’ ముగింపు కార్యక్రమంలో స్వయసేవకులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. సమాజంలో స్వయంసేవకుల ప్రవర్తన, భాష, సమాజ మేలు కోరే ఆలోచనలు, వాటిని తెలియచేసే విధానం కార్యవిస్తరణలో కీలకమని వాటిని విస్మరించకూడదని సూచించారు.
శిబిర ఏర్పాట్లు, సార్వజనికోత్సవం ఏర్పాట్లు బాగున్నాయని, వాటి వెనుక కార్యకర్తల శ్రమ కనపడుతున్నదని ప్రశంసించిన డా మోహన్ భాగవత్ ఇదే స్ఫూర్తితో స్వయంసేవకులు తమ తమ కార్యక్షేత్రాలలో పని చేయాలని ఆకాక్షించారు.
డిసెంబర్ 24 నుండి 26 వరకు జరిగిన శిబిరంలో అఖిల భారతీయ సహ సర్ కర్యవాహ్ శ్రీ ముకుందా గారు , దక్షిణ మధ్య క్షేత్ర సంఘచాలక్ శ్రీ వి నాగరాజు, తెలంగాణ ప్రాంత సంఘచాలక్ శ్రీ బూర్ల దక్షిణామూర్తి, దక్షిణమధ్య క్షేత్ర ప్రచారక్ శ్రీ ఆలే శ్యాం కుమార్, శ్రీ దూసి రామకృష్ణ తో సహ వివిధ క్షేత్ర, ప్రాంత అధికారులు పాల్గొని స్వయంసేవకులకు, కార్యకర్తలకు, వివిధ శ్రేణి సమావేశాలలో మార్గదర్శనం చేశారు.
ఈ శిబిరంలో రాష్ట్ర నలుమూలల నుండి 7940 మంది స్వయసేవకులు, శిబిర వ్యవస్థలో మరో వెయ్య మంది ప్రబందకులుగా పాల్గొన్నారు.