బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడికి వ్యతిరేకంగా మేడ్చల్ పట్టణంలో ‘ఇస్కాన్’ సంస్థతో సహా స్థానిక హిందూ సంస్థలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ బంగ్లాదేశ్‌లోని హిందూ కుటుంబాల ఇండ్ల పై దాడి చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
దసరా నవరాత్రి ఉత్సవాల సందర్బంగా బంగ్లాదేశ్ లోని ముస్లిం మతోన్మాదులు ఒక ప్రణాళిక బద్దంగా హిందువుల పై దాడి చేశారని ఆరోపించారు. ఈ నెల 13 నుంచి నాలుగు రోజుల పాటు కొనసాగిన దాడుల్లో ఇస్కాన్ మందిర పూజారి తో సహా మరో 4 గురు హిందువులు మృతి చెందారు. ఈ దాడుల్లో దేశ వ్యాప్తంగా దుర్గా మంటపాలు ధ్వంసం కాగా, దాదాపు 100మంది హిందువుల ఇండ్లపై దాడులు జరిపినట్లు సమాచారం.
బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ ఘటనకు ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఇక్బాల్ హుస్సేన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక్బాల్ హుస్సేన్‌ను ఉద్దేశ పూర్వకంగా ఉత్సవ మంటపంలో ఖురాన్ ను పెట్టి, ఆ నెపాన్ని హిందువులపై నెట్టి దీన్ని ఒక సాకుగా తీసుకొని ముస్లిం మతోన్మాదులు హిందువులపై దాడులు చేశారని ఆరోపించారు. అక్టోబర్ 23న బంగ్లాదేశ్‌లో దాడులకు నిరసనగా దాదాపు 150 దేశాల్లోని ఇస్కాన్ కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు, ప్రార్థన సమావేశాలు నిర్వహించారు. బంగ్లాదేశ్ లో దసరా ఉత్సవాల సంద్బర్బంగా హిందువుల పై దాడులను చేసిన ముష్కరులను శిక్షించాలని హిందూ కుటుంబాలను హిందూ గృహాలను ప్రాణాలను హరించిన దుష్టులను శిక్షించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. మేడ్చల్ పట్టణంలో ఇస్కాన్ సంస్థల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించిన ఈ కార్యక్రమంలో 50మంది మహిళలతో పాటు మొత్తంగా 200 మంది పాల్గొన్నారు. ఈ ర్యాలీలో ఇస్కాన్ సభ్యులు, బిజెపి కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.