Home Ayodhya 2. రామమందిరం ఉండేదనడానికి ఆధారాలు

2. రామమందిరం ఉండేదనడానికి ఆధారాలు

0
SHARE

పురావస్తు పరిశోధన
విస్తృతమైన తవ్వకాల తరువాత  పురావస్తు పరిశోధన శాఖ రామ జన్మభూమిలో నిస్సందేహంగా ఒక గొప్ప ఆలయము ఉండేదని నిర్ధారించింది. అలాగే దానిని కూల్చి ఆ స్థానంలోనే బాబరీ కట్టడ కట్టారని కూడా తేల్చింది.

సాహిత్య సాక్ష్యాలు
– సంస్కృత సాహిత్యము
– ముస్లిం రచయితల రచనలు
– విదేశీ రచయితల రచనలు మరియు నివేదికలు

మహర్షి వాల్మీకి కాలమునుండి ప్రస్తుత కాలము వరకు అనేక మహాకావ్యాలు, పురాణాలు, ఉపనిషత్తులు, కవితలు మరియు మతపరమైన గ్రంధాలలోను  అయోధ్య రాముని జన్మస్థానమని అనేక సందర్భాలలో  తెలియచేస్తున్నవి. అయోధ్య మహాత్మ్యంలో శ్రీ రామునికి సంబంధించి అనేక పవిత్ర స్థలాల గురించి వివరమైన వర్ణన కూడా ఉన్నది. ఇందులోనే  శ్రీ రామజన్మభూమి మందిరం ఉన్న ప్రదేశం గురించి మందిర ప్రాముఖ్యత గురించి వివరణ ఉంది.

కావ్యాలు: వాల్మీకి రామాయణము, మహాభారతంలో రామ ఉపాఖ్యానము (వన పర్వము), యోగ వాశిష్ట్యం, ఆధ్యాత్మ  రామాయణము, రఘువంశము మొ॥

కవితలు: రమాగీత-గోవిందము, గీత రాఘవ, రామ విలాసము, రామ అష్టకము మొ॥

నాటకాలు: ప్రతిమాభిషేకము, ఉత్తర రామచరిత్ర, హనుమానాటకము, ప్రసన్న రాఘవ, రామాభ్యుదయము మొ॥

ఆఖ్యాన: బృహత్ కథామంజరి, చంపు రామాయణము, కథ సరిత్సరం మొ॥

పురాణాలు: విష్ణు, బ్రహ్మాండ, వాయు, కూర్మ, పద్మ, స్కంద, నారద మొ॥

ఉపనిషత్తులు: రామోత్తర తపనీయ, రామ రహస్యము మొ॥

మరికొన్ని గ్రంధాలు: జైమినియా, అశ్వమేధము, హనుమత్ విజయము, హనుమత్ సంహితము, బృహత్ కౌశల్ ఖండ్  మొ॥

ముస్లిం రచయితల పుస్తకాలు:

1. సాహిఫా-ఈ-చాహల్-నాసా-ఇహ్-బహద్దూర్ షాహీ:

బహద్దూర్ షా కుమారుడైన అలంగిర్ కుమార్తె వ్రాసిన పుస్తకం (పదిహేడవ శతాబ్ది అంతం-పద్దెనిమిదవ శతాబ్ది ఆరంభం) ఇది.

బాదుషా ఆదేశం ప్రకారం నిర్మించబడిన మసీదులలో నమాజ్ ప్రార్థన, ఖుట్బా తెరియున్ నిషేధం. హిందువులకు మథుర, వారణాసి, అయోధ్య లలో ఉన్న దేవాలయాల పై విశ్వాసం అధికం. ఉదాహరణకు కృష్ణ జన్మస్థానం, సీతాదేవి పాకశాల(వంటగది), హనుమస్థానం (రావణవధ అనంతరం శ్రీ రాముడు అయోధ్యకు తిరిగి వచ్చాక, ఆయనకు చేరువలో ఉండాలనే ఉద్దేశ్యంతో హనుమ ఉన్న స్థలం). అవన్నీ ధ్వంసం చేసి, కేవలం తమ ఆధిక్యతను చూపించుకోవడానికే మసీదులు నిర్మించారు. జుమా, మరియు జుమా సమయంలో చేసే నమాజ్ (జమాయిత్) లకు, ఈ మసీదులలో అనుమతి లేదు. కానీ ఈ ప్రదేశాల్లో విగ్రహారాధన చేయరాదని, శంఖారావాలు ముస్లింల చెవులకు వినపడరాదని ఉత్తరువులు చేసారు.

2. హదిక-ఈ-షాదా : మీర్జా జాన్
1856 మీర్జా జాన్ ప్రకారం, సుల్తానులు  ఇస్లాంను ప్రచారం చేసి, హిందువులను అణగదొక్కారు. ఆ విధంగా ఫైజాబాద్ ను, అయోధ్యను ఆక్రమించారు. ఈ అయోధ్య ఒక పెద్ద తీర్థస్థలం మరియు శ్రీ రాముని తండ్రి దశరథుని రాజధాని. అక్కడ ఒక శోభాయమానమైన దేవాలయం ఉండేది. ఆ స్థానంలో ఒక మసీదు నిర్మించి, ప్రక్కనే ఉన్న మండపం ఉన్న చోట ఒక చిన్న మసీదును నిర్మించారు. ఆ దేవాలయమే శ్రీ రాముని జన్మస్థలం. ప్రక్కనే సీతాదేవి పాకగృహం(వంటగది).  సీత శ్రీ రాముని భార్య. మూస ఆషికన్ అనే వ్యక్తి సలహాతో బాబర్ బాదుషా ఆ ప్రదేశంలో మసీదును నిర్మించాడు. ఈ రోజుకీ ఆ మసీదును “సీతా రసోయి” అంటే సీత దేవి వంటగది అనే పిలుస్తారు.
3. ఫాసన-ఈ-ఇబ్రాత్: మీర్జా రజబ్ అలీ బైగ్ సరూర్
బాబర్ పాలనలో, అయోధ్య లో సీతాదేవి వంటగది ఉన్న స్థలంలో ఒక పెద్ద మసీదు నిర్మించబడినది. అదే బాబరీ మసీదు. దానిని వ్యతిరేకించేందుకు హిందువులకు శక్తి లేకపోవడంతో, మీరు ఆషికన్ అనే వ్యక్తి సలహా మీద అక్కడ మసీదు నిర్మించబడినది.
4. గంగష్ట్-ఈ-హాలాత్-అయోధ్య-అవధ్: మౌలావి అబ్దుల్ కరీం (బాబరీ మసీదు ఇమామ్)
1885 హజరత్ షాహ్ జమాల్ గుజ్జరి దర్గా తాలూకా వివరాలు తెలియజేస్తూ, ఈ రచయిత వ్రాసినది – దర్గాకు తూర్పుదిక్కున మహల్లా అక్బర్పూర్ ఉంది. దాని మారుపేరు  కోట్ రాజా రామచంద్ర. ఈ కోట లో కొన్ని బురుజులు ఉండేవి. అది ఆ రాజు జన్మ ప్రదేశం. అంతేకాక బురుజు కు పశ్చిమాన, జన్మస్థానం, సీతాదేవి వంటగది ఉండేవి. అవి ధ్వంసం చేసి రూపుమాపాక, బాదుషా బాబర్ అక్కడ ఒక పెద్ద మసీదును నిర్మించాడు.
5. తారీఖ్-ఈ-అవధ్: అల్లామా మహమ్మద్ నజముల్ ఘనీ ఖాన్ రాంపురీ 
1909 సయ్యద్ ఆషికన్ అనే వ్యక్తి రక్షణలో బాబర్ ఒక పెద్ద మసీదును, అయోధ్యలో శ్రీ రామ చంద్రుని జన్మస్థలంగా, ఒకప్పుడు ఉన్న ఒక దేవాలయం ఉన్న స్థలంలో నిర్మించాడు. ప్రక్కనే సీతాదేవి వంటగది ఉండేది. ఈ రోజుకీ అది సీత రసోయీ అనే పిలవబడుతోంది. ఆ దేవాలయం దీని ప్రక్కనే ఉంది.దేవాలయాన్ని ధ్వంసం చేసి, మసీదు నిర్మించారని నిర్ధారణ చేసే, ముస్లిం రచయితలు వ్రాసిన మరిన్ని పుస్తకాలు:
* జియా-ఈ-అక్తర్: హాజి మహమ్మద్ హస్సన్ 1878
* కేసర్ – ఉల్ – తవారిక్ (తవారిక్-ఈ-అవధ్) వాల్యూం 2 : కమాలుద్దీన్ హైదర్ హుస్సేన్ అల్ హుస్సేన్ అల్ మాషహాది
*అర్సార్-ఈ-హాకీకత్ : లక్ష్మీ నారాయణ్ సర్దార్ కానోన్గో అసిస్టెంట్ ఆఫ్ మున్షి మౌలవి హషామి
* హిందుస్తాన్ ఇస్లామీ ఆహద్ : మౌలానా హకీమ్ సయ్యద్ అబ్దుల్ హాయ్ – 1972విదేశీ చరిత్రకారుల సమగ్ర నివేదిక
1.భారతదేశపు చారిత్రక భౌగోళిక నివేదిక జోసెఫ్ టేఫ్లాంతర్ -1785
“రామ జన్మస్థాన్” దేవాలయాన్ని కూల్చి ఆ స్తంభాల ఆధారంగా మసీదు నిర్మాణం చేశాడు. కానీ హిందువులు తమ పవిత్ర స్థలం పై తమ అధికారాన్ని కోల్పోవటం ఇష్టంలేక మొగల్ రాజుల అరాచకాలను లెక్క చేయక ఆ పవిత్ర భూమిని దర్శించడం, పూజలు  నిర్వర్తించడం చేసేవారు. రామజన్మభూమిలోని దేవాలయాన్ని కూల్చి మసీదు నిర్మాణం చేసిన ఆవరణలోనే “రామచబూతర్ ” ను నిర్మించి ప్రదక్షిణలు చేసి సాష్టాంగ ప్రణామాలు చేస్తూ ఉండేవారు. ఈ రకమైన ఆరాధనలు ‘రామచబూతర్’ వద్దనే కాక మసీదు లోపల కూడా చేసేవారు.2. అవధ్ మండల అధికార పత్ర కారులు -1877
ఈ అధికార పత్రం ప్రకారం మొగలులు మూడు ముఖ్యమైన దేవాలయాలు పగులకొట్టి వాటిపైన మసీదుల నిర్మాణం చేసారని స్పష్టమవుతోంది.  రామజన్మభూమి స్థలంపై  మసీదు ను బాబరు 1528 లో నిర్మాణం చేశాడు.3. ఫైజాబాద్ అంగీకార పత్రం – 1880
ఈ నివేదిక , బాబరు  ‘బాబ్రీ మసీదు’ను 1528 లో  “రామ జన్మస్థల దేవాలయం ” పై అనగా శ్రీరామ జన్మ స్థలంలో కట్టాడని ధ్రువీకరించింది.4. న్యాయస్థానపు ఆదేశం:  న్యాయమూర్తి — కల్నల్  ఎఫ్ ఇ ఏ ఛైమియర్ సివిల్ అప్పీల్ నెంబర్ 27 — 1885
బాబ్రీ మసీదును స్వయంగా దర్శించిన తరువాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తూ జిల్లా న్యాయమూర్తి ఇలా అన్నాడు“హిందువుల పవిత్ర స్థలం పై మసీదును కట్టడం చాలా దురదృష్టకరం. కానీ దీనికి పరిష్కారం కనుక్కోవడానికి సమయం దాటిపోయింది. ఎందుకంటే ఈ సంఘటన జరిగి 356 సంవత్సరాలు దాటిపోయింది.’’5. భారతీయ పురాతన వస్తు నివేదిక–ఎ ఫ్యురర్ 1891
ఫ్యురర్”మీర్ ఖాన్  ‘బాబ్రీ మసీదు’ను రామజన్మభూమి స్థలములోనే, ఆ దేవాలయ స్తంభాల ఆధారంగా, నిర్మించా”డని తన నివేదికలో అంగీకరిస్తూ పేర్కొన్నాడు.

ఇంతే కాకుండా ఔరంగజేబు, అయోధ్యలోనే  1.స్వర్గద్వార్ , 2.  త్రేతా థాకూర్  దేవాలయాలను కూల్చి మరో రెండు మసీదులను నిర్మించాడని ధృవీకరించాడు.

6. బరబాంకీ జిల్లా అధికార పత్రం– హెచ్ ఆర్ నెవిల్ 1902
నెవిల్ నివేదిక ప్రకారం పలుమార్లు అయోధ్యలోని హిందూ పూజారులు ముసల్మానులకు మధ్యన రామజన్మభూమి మందిర స్థల విషయంపై ఘర్షణలు జరిగేవి. ఎందుకంటే మసీదును ఒక దేవాలయాన్ని కూలగొట్టి కట్టారు.

7. ఎన్సైక్లోపీడియా బ్రిటానికా15 వ ఎడిషన్ – వాల్యూమ్1 : 1978
పూర్వం నుండి ఉన్న రామ జన్మ మందిరాన్ని కూల్చి ఆ నిర్మాణంపైనే 1528లో మసీదును కట్టినట్లు చెప్పడానికి ఇది ఒక ఆధారం. అప్పటి చిత్రాలను చూపిస్తూ వాటి క్రింద   `భారత్ లోని   ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో, అయోధ్యా నగరంలో,” రామజన్మభూమి స్థలంపై మసీదు నిర్మాణం’ అని శీర్షికలో పేర్కొన్నారు. అంతకు ముందు వచ్చిన బ్రిటానికాలలో కూడా రామమందిరం గురించి పేర్కొన్నారు.

ఇతర ప్రచురణలు:-

8. ట్రావెల్ రిపోర్ట్ : విలియం ఫింఛ్, 1608 —1611
9. హిస్టారికల్ స్కెచ్ ఆఫ్ ఫైజాబాద్ :పి . కార్నెగీ 1870
10. ఇంపీరియల్ గెజిటీర్ ఆఫ్ ఫైజాబాద్ 1881
11. బాబర్ నామా ( ఆంగ్లం ): ఇనెట్ బెబరీస్  1920
12. ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 1934
13. అయోధ్య: హేన్స్ బెకర్ -1984
14. రామ జన్మభూమి వర్సెస్  బాబ్రీ మసీద్: కొన్రాడ్ ఎలస్ట్ – 1990

ఆల్ ఇండియా బాబ్రీ మస్జిద్ యాక్షన్ కమిటీ దాఖలు చేసిన పత్రాలు నిరాధారమైనందున సాక్ష్యం పనికిరావు. అవి వివిధ రాజకీయ పార్టీలకు చెందినవారి అభిప్రాయాలేకానీ ఎటువంటి ఆధారాలు కావు. బాబరు కానీ ఆయన ప్రతినిధులు కానీ అయోధ్యలో ఖాళీ స్థలాన్ని గుర్తించి అందులో మసీదు కట్టాలని చెప్పినట్లుగా ఎటువంటి పత్రమూ సాక్ష్యంగా దాఖలు చెయ్యలేదు.

శ్రీరామునికి వ్యతిరేకంగా బౌద్ధాన్ని నిలపాలనుకోవడంలో ప్రయోజనం లేదు. ఎందుకంటే బౌద్ధ ఆఖ్యానాలలో శ్రీరాముని ప్రస్తావన ఉంది. బుధ్ధుడు శ్రీరాముని వంశమైన ఇక్ష్వాకు వంశానికి చెందిన వాడని ఎంతో గర్వంగా ప్రస్తావించబడింది. వివిధ రామాయణాలు ప్రచారంలో ఉండడంవలన రామాయణం చారిత్రాత్మకతనే ప్రశ్నిస్తున్నారు. ఇది కూడా వాదనకు నిలువదు. ఎందుకంటే బైబిల్ సృష్టి గురించి రెండు కథలు ప్రచారంలో ఉన్నాయి. జీసస్ వంశం గురించి రెండు వివరణలు ఉన్నాయి. జీసస్ జీవితానికి  సంబంధించిన విశేషాలు ఒక్కొక్క గాస్పెల్ లో ఒక్కో విధంగా చెప్పారు. అయినప్పటికీ వీటిని పట్టుకునే ఏ మేధావి జీసస్ పుట్టనే లేదని అనలేదు.

రామందిరం గురించి కోర్టులు ఏమన్నాయి? తరువాయి భాగంలో..

Source: www.arisebharat.com

1. అయోధ్య రామమందిరం కోసం ప్రజాపోరాటం