Home Ayodhya రామమందిర ఉద్యమ రథ సారథులు – 4

రామమందిర ఉద్యమ రథ సారథులు – 4

0
SHARE

నిష్ఠా-గరిష్టులైన కార్యకర్త – ఓంకార భావే

విశ్వహిందూ పరిషత్ 1964లో ప్రారంభ‌మైంది. కానీ 1984లో ప్రారంభమైన శ్రీరామ జన్మభూమి మందిర ఉద్యమంతోనే దాని ఖ్యాతి ప్రభావితంగా పేర్కొనదగిన‌దని చెప్పవచ్చు. ఈ సందర్భంగా ప్రతి పోరాటాన్ని, అటంకాల్ని తన భుజాల‌పై మొసిన వారిలో శ్రీ ఓంకార్ భావే ప్రముఖులు. శ్రీ భావే 1924 జులై 26న ఉత్తరప్రదేశ్ లోని ఆజమ్ గఢ్ లో శ్రీమతి లక్ష్మీబాయి, శ్రీ నరసింహ్ భావే దంప‌తుల‌కు జ‌న్మించారు. వారి తండ్రిగారు శ్రీ నరసింహ భావే ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు. భావే గారు 14ఏళ్ల వ‌య‌సులో ఆర్‌.ఎస్‌.ఎస్ స్వ‌యంసేవ‌కయ్యారు. 1940, 41 & 42లో వారు ప్రథమ, ద్వితీయ & తృతీయ వర్ష సంఘ శిక్షావర్గ పూర్తి చేసారు. 1945లో ప్రయాగ విశ్వవిద్యాలయం నుండి బి.ఏ. చేసి ప్రచారక్ గా తమ జీవితాన్ని సంఘానికై అర్పించారు. భావేజీ ప్రయాగ, హరదోయి, అలీగఢ్, ఆగ్రా, ల‌క్నో లలో సంఘ ప్రచారక్ గా ప‌నిచేశారు. వారు రాష్ట్రధర్మ ప్రకాషన్ వ్యవస్థాపకులుగా, రాష్ట్రధర్మ మాస పత్రికకు సహ సంపాదకులుగా కూడా ఉన్నారు. ఆ త‌ర్వాత వారు ప్రయాగ విభాగ్, ప్రయాగ్ సంభాగ్, కాశి సంభాగ్ ప్రచారక్ గాను, పూర్వీ ఉత్తర ప్రదేశ్ శారీరిక, వ్యవస్థా ప్రముఖ్ గాను బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. 1962లో జరిగిన సంఘ శిక్షా వర్గలో ముఖ్య శిక్షక్ గా ఉన్నారు. అంతవరకు సంఘ శిక్షా వర్గకు ముఖ్యశిక్షక్ గా నాగపూర్ నుండే ఉండేవారు.

1975లో విధించిన ఎమ‌ర్జేన్సీ కాలంలో పోలీసుల కంట ప‌డ‌కుండా ప్రజాఉద్యమంలో క్రియాశీలంగా ప‌నిచేశారు. 1982లో విశ్వహిందూ పరిషత్ దేశ మొత్తంలో సంస్కృతి రక్షా నిధిని సేకరించింది. శ్రీ ఓంకార్ భావే గారికి ఆ సమయంలో మొత్తం ఉత్తర్ ప్రదేశ్ పనిని అప్ప‌గించారు. దీర్ఘకాలం పాటు లక్నో కేంద్రంగా వారు పరిషత్ కార్యానికి ముందుకు న‌డిపారు. 1983లో జరిగిన ప్రథమ ఏకాత్మత యజ్ఞం స‌మ‌యంలో గంగా మాతా, భారత మాత రథాలతో దేశమొత్తంలో వందలాది యాత్రలు జరిగాయి. వాటిలో హరిద్వార్ నుండి నాగపూర్ వరకు జ‌రిగిన యాత్ర‌కు ఓంకార్ జీ దీనికి ప్రముఖ్ గా వ్య‌వ‌హ‌రించారు. 1984లో వారు శ్రీ రామ జన్మభూమి ముక్తి యజ్ఞ సమితి, ధర్మస్థాన ముక్తి యజ్ఞ సమితికి గాను కార్యదర్శి నియమితుల‌య్యారు. రామ జన్మభూమి తాళం తెరువగానే రామజానకీ రథాలను ప్రభుత్వయంత్రాంగం ఆపివేసింది. వాటి ముక్తి కొరకు జరిగిన ఉద్యమానికి వీరే నేతృత్వం వహించారు. ప్రభుత్వం దిగివచ్చేంతవరకు పట్టువదులకుండా పోరాడారు. 1984లో వారికి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లలో పరిషత్ కార్య విస్తరణ చేశారు. 1990 నవంబర్ 2న‌ అయోధ్యలో జరిగిన కరసేవా లో వారు ఒక బృందానికి నేతృత్వం వహించారు. 1991లో ఢిల్లీ కేంద్రంగా వారు పరిషత్ కు జాతీయ‌ కార్యదర్శిగా నియమితుల‌య్యారు. 1995లో వారు సంయుక్త మహామంత్రి, 2009లో ఉపాధ్యక్షులుగా నియమితుల‌య్యారు. ఆ సమయంలో వారు మాతృశక్తి, దుర్గావాహిని, బజరంగ్ దళ్ పనిని కొంగ్రొత్త ఆయానుల‌ను ప్రసాదింపజేసారు.

వ్రాత, ప్రచురణ కార్యంలో భావే గారిది ఆరంభం నుండే రుచి ఉండింది. పరిషత్ కేంద్రీయ కార్యాలయం నుండి ప్రచురింపబడే పక్ష పత్రిక హిందూవిశ్వకు వారు సంపాదకులుగాను, ప్రకాశకులుగాను ఉన్నారు. పాక్షిక సమాచార బులిటిన్ సంస్కృతి సరగమ్ నకు కూడా ప్రకాశకులుగాను యాజమన్య బాధ్యతలో ఉన్నారు. స్వర్గీయ జగన్నాథ్ రావ్ జోషి గురించి ప్రచురించిన మరాఠి గ్రంథం, వారి అనేక ఉపాన్యాసాలను వారు హిందీలో అనువాదం చేసారు. పరిషత్ వివిధ ఆయామ్ ల గురించి వారు చిన్న-చిన్న పుస్తకాలు రాసి ముద్రించారు. జూన్ మాసపు తీష్ణ ఉష్ణోగ్రత సమయంలో పరిషత్ ప్రశిక్షణ వర్గ పర్యటనల నుండి తిరిగి వచ్చిన త‌ర్వాత శ్వాస సంబంధిత బాధ కారణంగా వారికి చికిత్సా కొరకు ఆస్ప‌త్రిలో చేరారు. ఆ త‌ర్వాత ఊపరితిత్తులు, కిడ్నీ స‌మ‌స్య‌ల‌తో వారు 2009 జులై 23న వారు తనువు చాలించారు. ఈ విధంగా ఒక నిష్ఠగల కార్యకర్త ఆజీవనం క్రియాశీలంగుంటూ మన సంఘ ప్రతిజ్ఞను పూర్తికావించారు.

రామమందిర ఉద్యమ రథ సారథులు – 1 :  రామభక్త జిల్లా కలెక్టర్ కె.కె.నాయర్

రామమందిర ఉద్యమ రథ సారథులు – 2 : పూజ్య దేవరహా బాబా

రామమందిర ఉద్యమ రథ సారథులు  – 3 : మహంత్ రామచంద్ర పరమహంసజీ మహారాజ్