Home News రోహింగ్యాలు శరణార్దులా.. శత్రువులా ?

రోహింగ్యాలు శరణార్దులా.. శత్రువులా ?

0
SHARE

పాస్ పోర్ట్ కోసం అప్లై చేసుకున్న యువకుడి గురించి  విచారణకు వచ్చిన పోలీసులకు అనుమానం కలిగి అదుపులోకి తీసుకుని విచారిస్తే అతను రోహింగ్యా యువకుడిని తేలింది. దానితోపాటు  పహడిషరీఫ్ పోలీసులకు అనేక విషయాలు తెలిసాయి.  మన దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన ఇస్మాయిల్ అప్పటికే ఆధార్, పాన్ , ఓటర్ కార్డులు అక్రమంగా సంపాదించేశాడు. ఇస్మాయిల్ మయన్మార్ దేశపు రఖాయిన్ రాష్ట్రానికి  చెందినవాడని , పోలీసులకు తెలిసింది. 2014 లో ఇతను బాంగ్లాదేశ్ గుండా కోల్ కతా చేరి అక్కడి నుండి ఢిల్లీ, ఆ తరువాత  కర్ణాటకలోని బెల్గాంలో కొంతకాలం పనిచేసి చివరికి పేరు మార్చుకుని హైద్రాబాద్ లోని పహడిషరీఫ్ దుకాణాల్లో పని చేస్తుండేవాడు.

ఇలా ఒకరుకాదు ఇద్దరుకాదు ఏకంగా 40 వేలమంది అక్రమంగా మనదేశంలోకి చొరబడ్డారు. హైద్రాబాద్, జమ్మూ, హర్యానా, పశ్చిమబెంగాల్ , రాజస్థాన్ లో మకాం వేశారు. తమకు రావలసిన ఒక చిన్న సర్టిఫికెట్ తీసుకోవడానికే జనం  ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. అలాంటిది   ఏ కాగితం  లేకుండా దేశాలు  దాటి భారత్ లోకి ఎలా రాగలిగారు? 4 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న జమ్మూ కాశ్మీర్ ఎలా చేరుకోగలిగారు?

బీహార్ లోని  బోధగయలో 2013 లో జరిగిన బాంబుదాడి జరిగిన సంఘటనను విచారించగా రోహింగ్యా ముస్లింలు దానికి కారణం అని తేలింది.

అంతర్జాతీయ సరిహద్దుకు దగ్గరగా ఉండటం వల్ల సరిహద్దు అవతల పాకిస్తాన్  టెర్రరిస్టులతో సంబందాలు పెట్టుకుని దేశభద్రతకు సవాళ్లు ఎదురుకావచ్చు.

అక్రమ వలసదారులు దేశ భద్రతకు సవాళ్లుగా మారె అవకాశం ఉండటంతో వారిపట్ల అనేక దేశాల మాదిరిగానే భారత్ కు  ఆందోళన కలుగుతోందని మన దేశ శాశ్వత ప్రతినిధి రాజీవ్ కె. చందర్ ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగపు సమావేశంలో తెలియజేశారు. మయన్మార్ నుండి పారిపోయివస్తున్న రోహింగ్యాలను భారత్ నుండి  వెళ్ళగొట్టొద్దని మానవహక్కుల విభాగపు అధిపతి అలం హుస్సేన్ చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది.

మయన్మార్ కు  శిక్ష తప్పదని , రోహింగ్యా ముస్లింలకు ఆర్థిక సహాయం, ఆయుధాలు, మిలిటరీ సహాయం చేయాలని ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అల్ ఖైదా విజ్ఞప్తులు జారీచేస్తుండటం దేనిని సూచిస్తుంది?

లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్ విన్నాము. ఇది శరణార్థి జిహాద్. శరణార్ధులుగా వచ్చి తీవ్రవాదులతో సంబందాలు పెట్టుకుని అనేక ఉగ్రవాద దాడులకు పాల్పడుతున్న వారిని ప్రపంచం చూస్తూనే ఉంది. అమెరికా, ప్రాన్స్, లండన్ లాంటి నగరాలు  ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. వీళ్ళను ఎలా వదిలించుకోవాలో తెలియక సతమతమవుతున్నాయి. ఫెన్సింగ్ వేసినా వాటిని తెంచుకుని మరీ లోపలకు జొరబడుతున్నారు.  దోపిడీలు , అత్యాచారాలు చేస్తున్నారు. ఫ్రాన్స్ లో చూస్తూనే ఉన్నాము.

రోహింగ్యా ముస్లింలకు మద్దతుగా పలు ముస్లిం సంస్థలు , వామపక్షాలు,  ఎంఐఎం , కాంగ్రెస్, తృణమూల్ లాంటి పార్టీలు చేపట్టిన ర్యాలీలలో పలు హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి.  అనంతనాగ్ లో  జరిగిన ర్యాలీ  హింసాకాండకు దారితీసింది. కొలకత, హైద్రాబాద్ లలో  కూడా ఇలాంటి పలు ర్యాలీలు జరిగాయి.

కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఐసిస్ (ISIS) తో సంబంధాలున్నట్లు తెలియడంతో అక్రమంగా ప్రవేశించిన రోహింగ్యా ముస్లింలతో దేశభద్రతకు ముప్పని సుప్రీంకోర్టుకు ఇచ్చిన వివరణలో కేంద్రప్రభుత్వం తెలియజేసింది.

ఎలాంటి ఒప్పందాలు లేకున్నా భారత్ లో  ఉంటున్నరోహింగ్యా ముస్లిం శరణార్ధులకు 53 టన్నుల సహాయసామగ్రిని పంపించింది.

50 సంవత్సరాలకు పూర్వం బంగ్లాదేశ్ నుండి నిర్వాసితులుగా వచ్చిన చక్మాల గురించి ఎవ్వరు పట్టించుకోలేదు. తమ స్వంత ప్రాంతమైన కాశ్మీర్ నుండి తరిమివేయబడ్డ కాశ్మీరీపండితులు దిక్కులేని స్థితిలో ఉన్నారు. వీరి గురించి ఎవ్వరు మాట్లాడరు.

రోహింగ్యా శరణార్ధులను ముస్లింలుగా చూడవద్దని, మానవతా దృక్పధంతో చూడాలని చెపుతున్న కాంగ్రెస్, వామపక్ష కుహనామేధావులు , అసాదుద్దిన్ ఒవైసీలు, మమతాబెనర్జీలు ముస్లింల గురించే  మాట్లాడుతూ తమ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దేశాన్నే బలి ఇవ్వాలని చూస్తున్నారు. హిందువులు, సిక్కులు, బౌద్ధులకు కష్టం వచ్చినప్పుడు ఏ మాత్రం కదలని వీళ్ళు ముస్లింలనే సరికి మాత్రం ఆందోళన పడిపోతారు. ఇదంతా ఓటు బ్యాంక్  రాజకీయాలు కాకుంటే ఇంకెమిటి. వీరికి ఇప్పుడు మాత్రమే మానవహక్కులు గుర్తుకు రావడం దేన్ని సూచిస్తోంది.

అక్రమవలసదారులైన రోహింగ్యాలను ముస్లింలు కాబట్టి ఇక్కడ శరణార్ధులుగా ఎందుకు స్వీకరించాలి?  భారతదేశాన్ని ప్రపంచ శరణార్థి కేంద్రంగా చేద్దామనుకున్నారా?

మన దేశంలొనే మనకిన్ని సమస్యలున్నప్పుడు పరాయిదేశ సమస్యలను మన నెత్తిమీదకు ఎందుకు పెట్టుకోవాలి.?

ఇప్పటికే బాంగ్లాదేశ్ కు చెందిన  2 కోట్ల ముస్లింలు భారత్ లో అక్రమంగా ఉంటున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు  చెబుతున్నాయి. ఇది జనాభా అసంతులనానికి దారితీస్తుంది. అంతే కాదు  భారత ప్రజలకు అందాల్సిన మౌలికవసతులు వీళ్ళు లాగేసుకపోతారు.

తమను ఇక్కడే శరణార్ధులుగా ఉండనివ్వాలంటూ , తమ దగ్గర ఐక్యరాజ్యసమితి ఇచ్చిన శరణార్థి పత్రాలున్నాయని ఇద్దరు రోహింగ్యాలు సుప్రీంకోర్టులో కేసు వేశారు. అక్రమంగా ప్రవేశించిన రోహింగ్యాలు 40 వేలమందికి పైగా ఉన్నారని  ఒక అంచనా. అందులో  14 వేలమంది దగ్గర ఐక్యరాజ్యసమితి పత్రాలున్నాయి. ఇది ఇంకో అనుమానానికి దారితీస్తోంది.  ఐక్యరాజ్యసమితి ఆమోదించిన  1951 శరణార్థి తీర్మానంపై భారతదేశం సంతకాలు చేయలేదు. 1967 లో వచ్చిన రెఫుజీ ప్రోటోకాల్ తీర్మానంపై  కూడా మన దేశంసంతకాలు చేయలేదు. అందువల్ల శరణార్ధులను భారతదేశానికి పంపడానికి ఐక్యరాజ్యసమితికి అధికారం లేదు. మరి వీరి దగ్గర పత్రాలు ఎలా వచ్చాయి.

ఇతర ముస్లిం దేశాలు వీరిని శరణార్ధులుగా ఆశ్రయమివ్వడానికి ఎందుకు ముందుకు రావడంలేదు. బాంగ్లాదేశ్ కూడా  వీళ్ళను ఎందుకు వదిలించుకోవలనుకుంటోంది.

వేగంగా విస్తరిస్తున్న రోహింగ్యా ముస్లింల జనాభా

 1869 జనాభాలెక్కల ప్రకారం రఖాయిన్ లో  5 శాతంగా ఉన్న వీరు 1983 వచ్చే సరికి 38 శాతం చేరి ప్రస్తుతం  44 శాతం ఉన్నారు. శరణార్ధులుగా వచ్చిన వీరి పెరుగుదల రేటు తమ దేశంలో  జనాభా అసంతులనానికి దారితీస్తుందని థాయిలాండ్ భయపడుతోంది.

పాలలో చక్కెరల ఉంటామన్న ఇజ్రాయిలీలను వేయి సంవత్సరాలు మనం ఆశ్రయమిచ్చాము. కానీ పాలలో విషపుచుక్కలా ఉండేవారికి ఇక్కడ ఆశ్రయముండదని స్పష్టంగా  చెప్పాల్సిన అవసరముంది.