రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్అ ఖిల భారతీయ కార్యకారి మండలి సమావేశాలు అక్టోబర్ 31 నుండి నవంబర్ 2 వరకు థానే జిల్లా భయందర్ సమీపంలోని కేశవసృతిలో మూడు రోజుల పాటు జరుగనున్నాయి. ఇందులో ప్రధానంగా సంస్థాపరమైన గుణాత్మకమైన విషయాలు, సంస్థ విస్తరణ పట్ల చర్చ జరుగుతుందని అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ అరుణ్ కుమార్ వెల్లడించారు.
ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అరుణ్ కుమార్ మాట్లాడుతూ సంవత్సరంలో రెండు సార్లు సంస్థకు సంబందించి సమీక్ష జరుగుతుందన్నారు. అందులో సాధారణంగా మొదటవి మార్చ్ నెలలో జరిగే అఖిల భారతీయ ప్రతినిది సభ (ఆ.భా.ప్ర.స) సమావేశాలు కాగా రెండవది విజయదశమి, దీపావళి మధ్యలో జరిగే అఖిల భారతీయ కార్యకారి సమావేశాలు. అఖిల భారతీయ ప్రతినిది సభ సమావేశాలలో సుమారుగా 1400 మంది వరకు పాల్గొంటారు. వివిధ ప్రాంతాలలో ఆరెస్సెస్ కు ప్రాతినిధ్యం వహించే వారితో పాటు వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొనే ఈ సమావేశాలలో ప్రతిపాదనలు తీర్మానించబడుతాయి. అఖిల భారతీయ కార్యకారి సమావేశాలలో 11 క్షేత్రాలు, 43 ప్రాంతాలకు ప్రాతినిద్యం వహించే వారితో పాటు, ప్రముఖమైన ఏడు అనుబంధ సంస్థల కార్యనిర్వాహక అధికారులు కలిసి సుమారుగా 350 మంది ప్రతినిధులు పాల్గొంటారు.
అఖిల భారతీయ కార్యకారి మండలి సమావేశాలలో సమకాలీన అంశాల పట్ల చర్చతో పాటు ప్రధానమైన సంస్థాగత విషయాలపై దృష్టి కేంద్రీకృతమై ఉంటుంది. సమావేశాలు అక్టోబర్ 31 బుధవారం ఉదయం 8:30 గంటలకు రామ్ రతన్ విద్యామందిర్ అంతర్జాతీయ పాఠశాలలోని దేవరస్ ఆడిటోరియంలో ప్రారంభం అవుతాయని అరుణ్ కుమార్ వెల్లడించారు.
ఆరెస్సెస్ సహా సర్కార్యవాహ డా.మన్మోహన్ వైద్య బుధవారం నాడు జరిగే విలేఖరుల సమావేశంలో అఖిల భారతీయ కార్యకారి మండలిలో చర్చకు చేపట్టే విషయాలపై వివరిస్తారు.
నవంబర్ 2 శుక్రవారం నాడు జరిగే విలేఖరుల సమావేశంలో ఆర్ఎస్ఎస్ సర్కార్యవాహ భయ్యాజి జోషి మాట్లాడుతారు. అందులో వివిధ అంశాల పట్ల ఆర్ఎస్ఎస్ వైఖరిని తెలుపుతూ, అఖిల భారతీయ కార్యకారి మండలి సందర్బంగా జరిగిన చర్చ గురించి వివరిస్తారని అరుణ్ కుమార్ తెలిపారు.
మా అభిప్రాయం మేరకు సుప్రీం కోర్ట్ ఈ విషయం పట్ల త్వరలో నిర్ణయం తెసుకోవాలి, ఒకవేళ ఏమైనా సమస్యలు ఉంటె, ప్రభుత్వం చట్టం చేసి అడ్డంకులను తొలగించి రామజన్మ భూమి స్థలాన్ని శ్రీ రామజన్మభూమి న్యాస్ కు అప్పగించాలి. మందిర నిర్మాణానికి, అందుకు అనుగుణంగా జరిగిన ఉద్యమసందర్బగా పూజనీయ సంతులు, ధర్మ సంసద్ వారు తీసుకున్న అన్ని నిర్ణయాలను మేము సమర్ధించాం, భవిషత్తులో కూడా చేస్తాం.
(ఆర్ ఎస్ ఎస్ సౌజన్యం తో)