Home News ఆరెస్సెస్ అఖిల భారతీయ ప్రతినిధి సభ – 2019: ఆజాద్ హింద్ ప్రభుత్వపు 75వ వార్షికోత్సవంపై...

ఆరెస్సెస్ అఖిల భారతీయ ప్రతినిధి సభ – 2019: ఆజాద్ హింద్ ప్రభుత్వపు 75వ వార్షికోత్సవంపై సర్ కార్యవహ సురేశ్ జోషి జీ ప్రకటన

0
SHARE
File photo - Bhaiyyaji Joshi
ఆజాద్ హింద్ ప్రభుత్వపు 75వ వార్షికోత్సవం
ఇప్పటికి సరిగ్గా 75 ఏళ్ళక్రితం నేతాజీ సుభాష్ చంద్ర బోస్ నేతృత్వంలో ఆజాద్ హింద్ సర్కార్ ఏర్పడింది (21 అక్టోబర్, 1943). భారత్ స్వాతంత్ర్యం పొందడంలో ఈ సంఘటన చాలా ముఖ్యమైనది.
ఆజాద్ హింద్ ఫౌజ్ నేతృత్వం వహించిన తరువాత నేతాజీ సుభాష్ చంద్ర బోస్ బ్రిటిష్ ప్రభుత్వంపై యుద్ధాన్ని ప్రకటించడానికి ముందు సింగపూర్ లో ప్రభుత్వ ఏర్పాటు చేశారు. ఇది అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం ముఖ్యమైన సంఘటన. అలాగే అతి తక్కువ కాలంలో బలం పుంజుకున్న ఆజాద్ హింద్ ఫౌజ్ భారత్ లోని ఈశాన్య ప్రాంతంలో బ్రిటిష్ సేనలకు వ్యతిరేకంగా సాగించిన విజయవంతమైన సైనిక దాడులు కూడా చాలా చెప్పుకోదగినవి. ఆజాద్ హింద్ ఫౌజ్ సర్కార్ ఆగ్నేయాసియా ప్రాంతంలో ఉన్న అన్నీ బ్రిటిష్ కాలనీల పౌర, మిలటరీ స్థావరాలను పూర్తిగా ఆక్రమించుకుంది. అలాగే ఇతర ప్రాంతాల్లో ఉన్న స్థావరాలను కూడా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించింది.
ఆజాద్ హింద్ సర్కార్ ప్రత్యేక కరెన్సీ, కోర్ట్ లు, పౌర నిబంధనలను ఏర్పాటు చేసింది. అలాగే కొత్త పన్ను వ్యవస్థను కూడా అమలు చేసింది. జపాన్, జర్మనితో సహా 9 దేశాలు ఆజాద్ హింద్ సర్కార్ ను పూర్తిస్థాయి ప్రభుత్వంగా గుర్తించాయి. ఈ ప్రభుత్వంలో కేబినెట్, రాజ్యాంగం, సైన్యం, కరెన్సీ, న్యాయవ్యవస్థ మొదలైనవన్నీ ఉన్నాయి. 1943లో స్వాధీనం చేసుకున్న అండమాన్ నికోబార్ దీవులను జపాన్ నౌకాదళం ఆజాద్ హింద్ ఫౌజ్ సర్కార్ కు అప్పగించింది. ఈ దీవులకు `షహీద్’, `స్వరాజ్’ అని పేర్లు పెట్టిన నేతాజీ 30 డిసెంబర్, 1943న జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సంఘటనలన్నీ భారతీయుల్లో, భారతీయ సైనికుల్లో కొత్త ఉత్సాహాన్ని, దేశభక్తి భావాన్ని నింపాయి. అవే స్వాతంత్ర్యోద్యమంలో కీలక పాత్ర పోషించాయి.
ఈ చరిత్రాత్మక సంఘటనలు జరిగి 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంలో ఆజాద్ హింద్ సర్కార్, నేతాజీ సుభాష్ చంద్ర బోస్, ఆజాద్ హింద్ సేనలో పోరాడిన వేలాదిమంది సైనికులను గుర్తుచేసుకోవడం మన కర్తవ్యం. ఆజాద్ హింద్ సర్కార్ సాధించిన ఘనకార్యాలను గుర్తిస్తూ ఇటీవల భారత ప్రభుత్వం ప్రకటన చేయడం ప్రశంసించదగిన చర్య. అలాగే దేశప్రజానీకానికి, ముఖ్యంగా యువతకు, ఈ స్ఫూర్తివంతమైన సంఘటనల గురించి తెలియజేయడానికి వివిధ రకాల కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము.

– సురేశ్ జోషి జీ
సర్ కార్యవహ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్.