Home News గుజ‌రాత్‌లోని భుజ్‌లో RSS అఖిల భారతీయ కార్యకారి మండల్ స‌మావేశాలు ప్రారంభం

గుజ‌రాత్‌లోని భుజ్‌లో RSS అఖిల భారతీయ కార్యకారి మండల్ స‌మావేశాలు ప్రారంభం

0
SHARE

గుజ‌రాత్ లోని క‌చ్ జిల్లా భుజ్‌లో మూడు రోజుల పాటు జ‌ర‌గ‌నున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ కార్యకారి మండల్ స‌మావేశాలు నవంబర్ 5న ఉదయం 9:00 గంటలకు ప్రారంభమ‌య్యాయి. మాన‌నీయ స‌ర్ సంఘ‌చాల‌క్ డాక్టర్ మోహన్ జీ భగవత్, స‌ర్ కార్య‌వాహ దత్తాత్రేయ హోసబాలే జీ భారత మాత చిత్ర‌ప‌టానికి పూలమాలలు వేసి నివాళుల‌ర్పించి స‌మావేశాల‌ను ప్రారంభించారు.

ఈ స‌మావేశాల్లో 11 క్షేత్రాల, 45 ప్రాంతాల‌కు చెందిన సంఘచాలక్‌లు, కార్యవాహ‌లు, ప్రచారక్‌లు, అఖిల భారతీయ కార్యకారిణి సదస్యలతో సహా 382 మంది కార్యకర్తలు అలాగే దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని సంస్థలకు చెందిన సంఘ్, అఖిల భారతీయ సంఘ‌ట‌న మంత్రులు స‌మావేశాల్లో పాల్గొంటున్నారు.

ఈ సంద‌ర్భంగా జాతికి, సమాజానికి విశేష సేవలందించిన వ్యక్తులకు నివాళులర్పించారు. సీనియర్ ప్రచారక్ శ్రీ రంగ హరి జీ, శ్రీ మదందాస్ దేవి జీ, ప్రముఖ వక్త, రచయిత తారక్ ఫతాహ్, సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు డాక్టర్ బిందేశ్వర్ పాఠక్, మాజీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడీ, పూర్వ సైనిక్ సేవా పరిసద్ వ్యవస్థాపక సభ్యుడు కమాండర్ బాలకృష్ణ జైస్వాల్, మహిళా కమిషన్ అధ్యక్షురాలు శ్రీమతి సుశీల బాలుని, పద్మ భూషణ్ ఎన్. విఠల్ IAS తో పాటు సమాజంలోని వివిధ వర్గాల ప్రముఖులకు, ఇటీవల నేపాల్‌లో సంభవించిన భూకంప మృతులకు కూడా సంతాపం తెలిపారు.

భారత్‌లోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా ఇటీవల వరదలకు సంబంధించిన సమాచారాన్ని పంచుకున్నారు. స్వయంసేవకులు ప్రత్యేకంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్ మరియు నాగ్‌పూర్‌లలో సమాజంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రభావితమైన ప్రజలకు సేవా స‌హాయ‌క కార్యక్రమాలు చేశారు.

బైఠక్‌లో ముఖ్యంగా.. సంఘ శతాబ్ది సంవ‌త్స‌రాన్ని దృష్టిలో ఉంచుకుని పనుల విస్తరణకు సంబంధించిన ప్ర‌ణాళిక‌ను సమీక్షిస్తారు. సంఘ శిక్షా వర్గల‌కు సంబంధించిన అంశాలపై చర్చిస్తారు. అంతే కాకుండా, సర్ సంఘ‌చాలక్ జీ విజయదశమి ప్రసంగంలో ప్రస్తావించిన అంశాలు.. ప్రపంచంపై వాతావరణ మార్పుల ప్రభావం, భద్రతపై విధానాలు, స్వావలంబన తదితర విధానాలు, ఇతర ముఖ్యమైన అంశాలు చర్చిస్తారు. సామాజిక సమరసత, కుటుంబ ప్రబోధన్, గో సేవ, గ్రామసేవ, ఇతర కార్యకలాపాల కోసం జరుగుతున్న ప్రయత్నాల గురించి సమగ్ర సమాచారం కూడా సేకరించబడుతుంది. ఈ బైఠక్ నవంబర్ 7 సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది.