
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS), జాతీయ పతాకం మధ్య గల అవినాభావ సంబంధాన్ని పరమపూజ్య మాననీయ సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్‌జీ వివరించారు. దేశంలో మొట్టమొదటి సారి జాతీయ పతాకాన్ని ఎగురవేసినప్పటి నుంచి పతాకాన్ని గౌరవించడంలో స్వయంసేవక్ ముందున్నారని తెలిపారు. ఈ క్రమంలో అప్పట్లో నెహ్రూజీ సమక్షంలో జరిగిన ఒక ఘటనను వారు చెప్పారు.