
ఝాన్సీ లక్ష్మీబాయి
వీపు పుతృని గట్టె వీర ఝాన్సిని జూడు
హయమునెక్కి కదిలె రయము గాను
కాళికోలె నిలచె కరవాలమునుబట్టి
వినుర భారతీయ వీర చరిత
భావము
డల్హౌసీ రాజ్యసంక్రమణ సిద్ధాంతాన్ని వీర ఝాన్సీరాణి ఎదిరించారు. పసి బాలుడిని వీపుకు కట్టుకొని గుర్రాన్ని ఎక్కారు. వేగంగా కదిలి రెండు చేతులలో కరవాలములు పట్టుకున్నారు. గుర్రమును నియంత్రించే కళ్ళెమును నోటిలో ఉంచుకున్నారు. అపర కాళికావతారమును ఎత్తారు. ఆంగ్లేయుల తలలు నరికి అమ్మ భారతి పాదాల చెంత తల వాల్చిన వీర ఝాన్సీ రాణి చరిత విను ఓ భారతీయుడా!
-రాంనరేష్