శ్రీ బాబూరావ్ వైద్య (మాధవ గోవింద వైద్య) జీ స్వర్గస్థులు కావడం పట్ల విచారం వ్యక్తం చేస్తూ పరమపూజనీయ సర్ సంఘచాలక్, మాననీయ సర్ కార్యవాహ విడుదల చేసిన శోక సందేశం :
శ్రీ మాధవ గోవింద ఉపాఖ్య బాబూరావ్ జీ వైద్య స్వర్గవాసులు కావడంతో సంఘ కార్యకర్తలమంతా ఒక జ్యేష్ట కార్యకర్తను, పెద్ద దిక్కును కోల్పోయాము. సంస్కృత పండితుడు, ఉత్తమ రచయిత, విధానసభ సభ్యుడు, గొప్ప సాహిత్యకారుడు అయిన శ్రీ వైద్య తమ శక్తిసామర్ధ్యాలు, నైపుణ్యాలను పూర్తిగా సంఘ కార్యానికే సమర్పించారు. సంఘ కార్య వికాస యాత్రలో ఆయన సక్రియంగా పాల్గొనడమేకాక అందుకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచారు. వ్యక్తిగత, కుటుంబ, సామాజిక, వృత్తిపరమైన నాలుగు రంగాలలోనూ సంఘ సంస్కారాలు పూర్తిగా ప్రతిఫలించే విధంగా సంఘానుకూలమైన, సుందరమైన గృహస్థు జీవితం గడిపారు. సరళ భాషలో, తర్కబద్ధంగా, సంఘాన్ని గురించి అనుభూతితో కూడిన పరిశీలనను తమ ఉపన్యాసాలు, రచనల ద్వారా ప్రపంచానికి అందజేశారు. దీని మూలంగా వారి తరువాతి తరానికి చెందినవారు కూడా దేశకార్యమే జీవన కార్యంగా తీసుకుని ముందుకు సాగారు. వారి ఇద్దరు కుమారులైన శ్రీ మన్మోహన్ జీ, శ్రీ రామ్ జీ లు జ్యేష్ట ప్రచారకులుగా ఇప్పటికీ పని చేస్తున్నారు.
అటువంటి ఆదర్శవంతమైన వ్యక్తిత్వం మన కళ్ల ముందు నుంచి అదృశ్యం కావడం ఎంతో లోటును కలిగిస్తుంది. శ్రీ వైద్య జీ కుటుంబం కూడా పెద్ద దిక్కును కోల్పోయింది. ఆ కుటుంబానికి ఓదార్పు చేకూర్చడం కష్టం. కాలమే ఆ పని చేయాలి. కర్తవ్యపాలన కార్యాన్ని నిష్టతో, స్థిరంగా చేయడం ఎలాగో ఆయన జీవితం మనకు నేర్పుతున్నది. ఆయన ఆదర్శవంతమైన జీవనాన్ని అనుసరిస్తూ, ఈ శోక సమయాన్ని ఎదుర్కొనే ధైర్యం మనకు, వైద్య జీ కుటుంబానికి లభించాలని, ఉత్తమమైన తపస్సుతో కూడిన జీవనపు పుణ్య ఫలం దివంగత ఆత్మకు శాంతి, సద్గతులు కలిగించాలని ప్రార్ధిద్దాం.
–మోహన్ భాగవత్, సర్ సంఘచాలక్
–సురేశ్ (భయ్యా) జోషి , సర్ కార్యవాహ
“श्री बाबूरावजी वैद्य का जीवन व्यक्तिगत, पारिवारिक, सामाजिक तथा आजीविका इन चतुर्विध आयामों में संघ संस्कारों की अभिव्यक्ति करने वाला संघानुलक्षी, संपन्न व सुंदर गृहस्थ जीवन था।”
श्री बाबूराव वैद्य जी के दुःखद निधन पर परमपूजनीय सरसंघचालक और माननीय सरकार्यवाह जी का शोक सन्देश : pic.twitter.com/4cZBe3SWjG
— RSS (@RSSorg) December 19, 2020