మలబార్ ప్రాంతంలో హిందువులపై మోప్లా ముస్లింలు జరిపిన నరమేధం ఆధారంగా రూపొంది కేరళ సెన్సార్ బోర్డు నుంచి అనేక కోతలు ఎదుర్కొన్న మలయాళ చిత్రం “పూజా ముతల్ పుజా వారే” (Puzha Muthal Puzha Vare) కు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)కు చెందిన జె నందకుమార్ జీ మద్దతు తెలిపారు. చిత్ర దర్శకుడు అలీ అక్బర్‌కు ఆయన అండగా నిలిచారు. చారిత్రక ఆధారాలున్న చిత్రంలోని సన్నివేశాలను తొలగించాలని చిత్రనిర్మాతను కోరడం ఘోరమైన అన్యాయమని ఆయన ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.
“సమాజాన్ని కులాల వారీగా విభజించడానికి ప్రయత్నించే సామాజిక మతవాదం, జాత్యహంకారాన్ని ప్రోత్సహించే అనేక చలన చిత్రాలను కేరళ సెన్సార్ బోర్డు ఆమోదించింది. ఇస్లామిక్ కథనం ప్రధానంగా ఉన్న జనగణమన, పుజు వంటి చిత్రాలు కేరళలో సర్టిఫికేట్ కలిగి ఉన్నాయి. ప్రస్తుత సెన్సార్ బోర్డ్ కేరళ ప్రాంతీయ అధికారి హయాంలో దేశ వ్యతిరేక, దేశద్రోహ మతతత్వ సినిమాలు సెన్సార్ లేకుండానే సర్టిఫికేట్ పొందాయి. భారతదేశంలో నోట్లే కాదు ఓట్లను కూడా నిషేధిస్తాం అంటూ ప్రభుత్వం, రాజ్యాంగంపై విద్రోహ వ్యాఖ్యలతో కూడిన జనగణమన సర్టిఫికేట్ ఎలా పొందింది?. కేరళలో తీసిన, విడుదలైన సినిమాల్లో ఎక్కువ భాగం రాజకీయ ప్రయోజనంతో కూడుకున్నవేనని, సమాజాన్ని విభజించాలనుకునే ఇస్లామిస్టులు లేదా కమ్యూనిస్టుల ప్రోత్సహం ఈ చిత్రలకు ఉంటుంది. కేరళ సెన్సార్ బోర్డు అధికారులు సీపీఐ(ఎం)సభ్యులలా వ్యవహరిస్తూ సినిమాలో కోతలు విధించారని ఆరోపించారు. దీని వెనక సీపీఐ(ఎం) నాయకులు కూడా ఉన్నారు.” అని ఆయన ఆరోపించారు.
Censor Board Kerala has approved a hell of a lot of feature films promoting social communalism and racism that seek to divide society on the lines of caste. It has certified films like JanaGanaMana and Puzhu, which pushed Islamist narrative of Indian democracy & Hindu society 1/n
— J Nandakumar (@kumarnandaj) September 6, 2022
హిందూ మతంలోకి తిరిగి వచ్చిన తర్వాత తన పేరును రామసింహన్ అబూబక్కర్‌గా మార్చుకున్న అలీ అక్బర్, చారిత్రక చిత్రంలో అనేక సన్నివేశాలను తొలగించాలని కేరళ సెన్సార్ బోర్డు తీసుకున్న చర్యపై తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. మోప్లా ముస్లింలు హిందువులపై మలబార్ నరమేధం సమయంలో హిందువులు చూసిన అనుభవించిన క్రూరత్వాన్ని ఈ కోతలు చిత్ర ఉద్దేశాన్ని మారుస్తాయని ఆయన ఆరోపించారు.
కేరళ సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరించింది. రివైజింగ్ కమిటీ సమీక్ష కోసం సినిమాను CBFCకి రిఫర్ చేసింది. సినిమాకు సర్టిఫికేట్ జారీ చేయడంలో జాప్యం చేయడంలో PFI పాత్ర ఉందని చిత్ర దర్శకుడు అనుమానిస్తున్నారు.
Source : NEWS BHARATHI