
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS) భాగ్యనగర్ సంభాగ్ (హైదరాబాద్ – సికింద్రాబాద్) ఆధ్వర్యంలో సోమవారం (05-సెప్టెంబర్) హైదరాబాదులోని అతిపెద్ద వినాయక ప్రతిమైన ఖైరతాబాద్ వినాయకుని సమక్షంలో ఘోష్ నాదంతో స్వయంసేవకులు పూజ చేశారు. ఈ కార్యక్రమంలో 140 మంది ఆర్.ఎస్.ఎస్ ఘోష్ స్వయంసేవకులు పాల్గొన్నారు. 30 నిమిషాల పాటు సాగిన ఘోష్ వాదనను ఆలకించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఘోష్ వాదన అందరినీ మంత్రముగ్ధులను చేసింది. ఈ కార్యక్రమంలో ఆర్.ఎస్.ఎస్ ప్రాంత, విభాగ్ అధికారులు పాల్గొన్నారు.