Home News స‌రిహ‌ద్దు ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు ఆర్‌.ఎస్‌.ఎస్ అండ‌గా నిలుస్తుంది – శ్రీ ద‌త్తాత్రేయ హోస‌బ‌లే జీ

స‌రిహ‌ద్దు ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు ఆర్‌.ఎస్‌.ఎస్ అండ‌గా నిలుస్తుంది – శ్రీ ద‌త్తాత్రేయ హోస‌బ‌లే జీ

0
SHARE
  • శ్రీ రామ్‌లాలా చిత్రంతో ప్రతి ఇంటికి స్వయంసేవకుల సంపర్క్ అభియాన్
  • సామాజిక సామరస్యం, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ కోసం స్వయంసేవకులు కృషి

దేశ వ్యాప్తంగా ఉన్న సరిహద్దు ప్రాంతాల భద్రత దృష్ట్యా ఆయా ప్రాంతాల్లో ఆరోగ్య సదుపాయాలు, విద్య, భద్రత, స్వావలంబన, పౌర విధులకు సంబంధించిన కార్య‌క్ర‌మాల‌ను సీమ (సరిహ‌ద్దు) జాగరణ్ మంచ్ ద్వారా కృషి చేస్తుంద‌ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్య‌వాహ దత్తాత్రేయ హోసబలే జీ అన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో స్థానిక పౌర, భద్రతా బలగాలతో సమన్వయం పెంచేందుకు కూడా ప్రత్యేక కృషి చేస్తామ‌న్నారు.

గుజ‌రాత్‌లోని భుజ్‌లో మూడు రోజుల పాటు జ‌రిగిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ కార్యకారి మండల్ (ABKM) సమావేశాలు నవంబర్ 7న ముగిశాయి. ఈ స‌మావేశాల్లో 45 ప్రాంతాలు, 11 క్షేత్రాలకు చెందిన 357 మంది ప్రతినిధులు సంఘచాలక్‌లు, కార్యవాహులు, ప్రచారక్‌లు, కార్య‌కారిణి సభ్యులు, వివిధ సంస్థల సంఘ‌ట‌న మంత్ర‌లు పాల్గొన్నారు.

సమావేశం చివరి రోజు విలేకరుల సమావేశంలో సర్ కార్య‌వాహ దత్తాత్రేయ హోసబలే జీ మాట్లాడుతూ రామ మందిర నిర్మాణం కోసం, జాతీయ గుర్తింపు కోసం దేశ వ్యాప్తంగా భారీ ఉద్యమం జరిగిందన్నారు. శ్రీరామ జన్మభూమి ఆలయ పనులు దాదాపు పూర్తయ్యాయ‌ని, జనవరి 22న కొత్తగా నిర్మించిన ఆలయంలో శ్రీరామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ జరగనుంద‌ని తెలిపారు. ఈ పుణ్య కార్యానికి ఆర్‌.ఎస్‌.ఎస్ సర్ సంఘ‌చాలక్ జీ, భార‌త ప్రధాన మంత్రిని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం ఆహ్వానించింద‌ని తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రజలు ఈ చారిత్రాత్మక ఘట్టానికి సాక్షులుగా మారేలా చూసేందుకు జనవరి 1 నుండి జనవరి 15 వరకు స్వయంసేవకులు శ్రీ రామ జన్మభూమి తీర్థం అందించిన అక్షతతో శ్రీ రామ్ లల్లా చిత్రాలను దేశవ్యాప్తంగా ప్రజలను ఆహ్వానిస్తూ ఇంటింటికీ సంపర్క్ అభియాన్ నిర్వహిస్తార‌ని తెలిపారు.

సంఘం వందేళ్ల సందర్భంగా సామాజిక సామరస‌తా, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, గో సేవ, కుటుంబ ప్రబోధన్ వంటి అంశాలను సమాజం ముందుంచేందుకు కృషి చేశామన్నారు. వ్య‌క్తిగ‌తంగా అచ‌రిస్తూ, అలాగే శాఖలో కూడా ఆచరించాలని సూచించారు. కావున సామాజిక సామరస్యంతో సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకురావడానికి, పర్యావరణ పరిరక్షణ, మొక్కలు నాటడం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, నీటిని సంరక్షించడం వంటి అంశాల్లో కుటుంబ విద్య ద్వారా సాంస్కృతిక విలువలను రాబోయే తరానికి అందించాల‌న్నారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ప్రాంతంలో సంఘ కార్యకర్తలు 14,000 కిలోమీటర్లు ప్రయాణించి 15 లక్షల చెట్లను నాటార‌ని, అలాగే కర్ణాటకలో సీడ్ బాల్ పద్ధతిలో కోటి మొక్కలు నాటేందుకు ప్రణాళిక చేశార‌ని తెలిపారు. దేశంలోని పౌరులందరి జీవనశైలి స్వదేశీయంగా ఉండాలని, పౌర కర్తవ్యాన్ని పాటిస్తూ తమ జీవితాల్లో క్రమశిక్షణ తీసుకురావాలన్నారు.

సంఘ శిక్షాణ కార్య‌క్ర‌మాల‌లో కూడా మార్పులు వ‌చ్చాయ‌ని, ఇందులో యువకులు, పెద్దలు సహా ప్రతి వయస్సుల‌ వారికి భిన్నంగా ఉంటాయ‌ని తెలిపారు. శిక్షా వర్గ‌ల‌లో సామాజిక జీవితంలోని వివిధ రంగాలలో ప్రత్యక్షంగా దోహదపడేలా మేధో, శారీరకంగా కాకుండా, ఆచరణాత్మక శిక్షణ ఇవ్వబడుతుంద‌ని తెలిపారు.

ఇతర అంశాలపై కూడా సమావేశంలో చర్చించామని తెలిపారు. “సంఘంలో రెండు రకాల పనులు ఉంటాయి. ఒకటి శాఖాధారితం, సమాజంలో మంచి లక్షణాన్ని నిర్మించే పనిని సంఘం 98 సంవత్సరాలుగా ఎంతో పట్టుదలతో నిర్వహిస్తోంది. సంఘ‌ దృక్పథం సమాజానికి సేవ చేస్తుంది. మరోవైపు, స్వయంసేవక్ వ్య‌క్తి నిర్మాణం, దీని ద్వారా దేశం కోసం నిలబడే వ్యక్తులు అన్ని ప్రాంతాల‌లో త‌యార‌వుతారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రోజువారీ, వారపు శాఖల (సాప్తాహిక్‌) సంఖ్య 95528. శతాబ్ది సంవత్సరం నాటికి దేశంలోని 59060 మండలాలకు సంఘ పనిని విస్తరించాలని ఆర్‌.ఎస్‌.ఎస్‌ లక్ష్యం. అన్ని వయసుల వారు శాఖకు వస్తారు. సాధారణంగా, స్వయంసేవకులకు సంఘంలో సభ్యత్వం ఉండదు. ఈ సంవత్సరం గురు పూజలో నిత్య శాఖకు చెందిన 37 లక్షల మందికి పైగా స్వయంసేవకులు పాల్గొన్నారు.” అని స‌ర్ కార్య‌వాహ జీ పేర్కొన్నారు.

కార్యకారి మండల సమావేశం సంవత్సరానికి రెండుసార్లు జరుగుతుందని, ఒకటి మార్చి నెలలో అఖిల భారతీయ ప్రతినిధి సభ (ABPS), రెండవది అఖిల భారతీయ కార్యకారి మండల్ (ABKM) దసరా దీపావళి మధ్య జరుగుతుందని ఆయ‌న తెలిపారు.

కార్యక్రమాలను గుర్తుచేసుకున్నారు. సమాజ సహకారంతో స్వయంసేవకుల కృషి ఇప్ప‌టికీ నిరంతరంగా కొనసాగుతోంద‌న్నారు. సౌరాష్ట్ర – కచ్‌లోని స్వయంసేవకులు అస్సాం, త్రిపురలో అమలులో ఉన్న పథకాలలో సహాయం చేస్తున్నార‌ని, ఇది తూర్పు, పడమర కలిపే ఈ పని ముఖ్యమైనద‌న్నారు.

విలేకరుల సమావేశంలో అఖిల భారతీయ ప్రచార్ ప్రముఖ్ సునీల్ అంబేకర్ జీ, అఖిల భారతీయ సహ‌-ప్రచార్ ప్రముఖ్ నరేంద్ర ఠాకూర్ జీ, అలోక్ కుమార్ జీ పాల్గొన్నారు.