Home News గ్రామాల్లో శాఖల‌ విస్త‌ర‌ణపై ఆర్‌.ఎస్‌.ఎస్ దృష్టి – శ్రీ కాచం ర‌మేష్

గ్రామాల్లో శాఖల‌ విస్త‌ర‌ణపై ఆర్‌.ఎస్‌.ఎస్ దృష్టి – శ్రీ కాచం ర‌మేష్

0
SHARE

రాబోవు రోజుల్లో రైతులు, కోసం ప్రత్యేకంగా శాఖలను నిర్వహించనున్నట్లు రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) ప్రాంత కార్యవాహ్‌ (తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి) కాచం రమేష్‌ వెల్లడిన్నారు. విద్యార్థులు, రిటైర్డ్‌ ఉద్యోగులు, వయోవృద్ధుల కోసం ఇన్నాళ్లు తాము శాఖలను నిర్వహించగా, రాబోయే రోజుల్లో రైతుల కోసం ప్రత్యేకంగా శాఖలను నడపనున్నామన్నారు. గురువారం బర్కత్‌పురలోని కేశవనిలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ప్రాంత సహ సంఘచాలక్‌( ఉపాధ్యక్షుడు) సుందర్‌రెడ్డి తో కలిసి మీడియాతో మాట్లాడారు. మార్చి 11 -13 వరకు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిర్వహించిన అఖిల భారత ప్రతినిధి సమావేశాల వివరాలను.. తీర్మానం ను మీడియాకు తెలిపారు.

సంఘ శాఖకు ఆకర్షితులు అయ్యే వారి సంఖ్య పెరుగుతున్నది. కరోనా గడ్డు పరిస్థితులను దాటుకుని సంఘ కార్యం సాధారణ స్థితికి చేరుకుందని, దేశమంతటా వేగంగా విస్తరిస్తున్నదని కాచం రమేష్‌ వెల్లడించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ పట్ల ఆకర్షితులయ్యే వారి సంఖ్య పెరుగుతోందన్నారను. దేశంలో గతేడాది 55,652శాఖలుంటే ఈఏడాదికి 60, 929శాఖలకు చేరుకున్నదని, విద్యార్థులు ఔత్సాహికులంతా సంఘశాఖలకు వచ్చేందుకు ఉత్సాహం చూపుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో గతేడాది 175 గ్రామాల్లో 311 కొత్తశాఖలను ప్రారంభించామన్నారు. జాయిన్‌ ఆర్ ఎస్ ఎస్ ద్వారా 1.25లక్షల మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని, తెలంగాణ 26వేల మంది రిజిస్ట్రేషన్‌ చేసుకోగా, గత ఫిబ్రవరిమాసంలోనే 838 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని వివరించారు.

2024 నుంచి శతాబ్ధి వేడుకలు.
2024 సంవత్సరం నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌ శతాబ్ధి వేడుకలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో పట్టణాల్లో ప్రతి 10వేల మంది నివాసముండే పట్టణాలలో బస్తి , గ్రామాల్లో ఉపమండలం (నాలుగైదు గ్రామాలకు) వరకు సంఘాన్ని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇప్పటికే 1443 బస్తీలకు గాను 793 బస్తీల్లో శాఖలు నడుస్తున్నాయని, 12, 630 గ్రామాలకు గాను 65శాతం గ్రామాల్లో శాఖలు జరుగుతున్నాయని వందశాతం గ్రామాలకు చేరుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

గ్రామాల సర్వాంగీణ వికాసానికి కృషిచేస్తున్నామని, తెలంగాణలో 13 గ్రామాల ఉన్నతికి కృషిచేసిన తాము మరో 40 గ్రామాల వికాసానికి పాటుపడనున్నామన్నారు. ఇలా ప్లాస్టిక్‌ నియంత్రణ, నీటిని పొదుపుగా వాడటం, పర్యావరణ పరిరక్షణ, సామరస్యపూరిత వాతావరణాన్ని కాపాడేందుకు కృషిచేస్తున్నామన్నారు. హిజాబ్‌ విషయంపై స్పందించిన కాచం రమేష్‌ స్కూల్లో అంతా యూనిఫామ్‌ను ధరించాల్సిందేనన్నారు. ఆలయాలు, గుడులు వంటి హింధూధార్మిక సంస్థలపై ప్రభుత్వ పెత్తనం సరికాదని, అవి స్వతంత్య్రంగా నడవాలన్నారు.