Home News రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ క్షేత్ర సమావేశాలు నేటి నుండి ప్రారంభం 

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ క్షేత్ర సమావేశాలు నేటి నుండి ప్రారంభం 

0
SHARE
File Image
File Image

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్,  తెలంగాణ ప్రాంతం
పత్రికా ప్రకటన

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రతి సంవత్సరం 3 జాతీయ స్థాయి సమావేశాలను జరుపుతుంది. మార్చిలో అఖిల భారతీయ ప్రతినిధి సభ, జులైలో ప్రాంత ప్రచారక్ ల బైఠక్ లు (సమావేశాలు), దీపావళికి ముందు అఖిల భారతీయ కార్యకారీ మండలి (ABKM) సమావేశాలు ఉంటాయి. ఈ కార్యకారీ మండలి సమావేశాల్లో ప్రాంత సంఘచాలక్ లు (రాష్ట్ర అధ్యక్షులు), ప్రాంత కార్యవాహలు (రాష్ట్ర కార్యదర్శులు), ప్రాంత ప్రచారక్ (రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శులు) లతో కూడిన కార్యనిర్వహణ కౌన్సిల్ సభ్యులు పాల్గొంటారు.

అయితే ఈ సంవత్సరం కోవిడ్ పరిస్థితుల మూలంగా సమీక్షా సమావేశాలన్నీ ప్రదేశాలవారీగా క్షేత్ర స్థాయిలోనే జరిగాయి. సంఘ వ్యవస్థ ప్రకారం దేశంలో 11 క్షేత్రాలు(ప్రదేశాలు), 46 ప్రాంతాలు(రాష్ట్ర కేంద్రాలు) ఉన్నాయి. దక్షిణమధ్య క్షేత్రపు(South Central Region) సమావేశాలు హైదారాబాద్ అన్నోజీగూడా లోని శ్రీ విద్యా విహార పాఠశాలలో అక్టోబర్, 30, 31 లలో జరుగుతాయి. పూజనీయ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ , మాననీయ సర్ కార్యవాహ శ్రీ భయ్యాజీ జోషిలు ఈ సమావేశాల్లో మార్గదర్శనం చేస్తారు. ఈ క్షేత్రంలో ఉండే అఖిలభారతీయ పదాధికారులు, కర్ణాటక, తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ లకు చెందిన కార్యనిర్వహణ కౌన్సిల్ సభ్యులు ఈ సమావేశాల్లో పాల్గొంటారు.
రెండు రోజుల సమావేశాల్లో ఆర్ ఎస్ ఎస్ శాఖల సంఖ్యాపరమైన, గుణాత్మక వృద్ధి, స్వయంసేవకుల ద్వారా జరుగుతున్న వివిధ సేవా కార్యక్రమాలు, దేశానికి సంబంధించి ప్రధాన అంశాల గురించి చర్చ జరుగుతుంది.

తిప్పేస్వామి
క్షేత్ర కార్యవాహ, దక్షిణమధ్య క్షేత్రం, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

ఆయుష్ నడింపల్లి
ప్రాంత ప్రచార ప్రముఖ్, తెలంగాణ
9848038857