Home News బైంసా భ‌వ్య‌ ప‌థ‌సంచ‌ల‌న్

బైంసా భ‌వ్య‌ ప‌థ‌సంచ‌ల‌న్

0
SHARE

నిర్మల్ జిల్లా మహిషా(భైంసా)నగరంలో మార్చి 5 ఆదివారం రోజున నగర శారీరిక్ ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ కార్యక్రమం గత నెల 19న‌ శివాజీ జయంతి రోజు జరగాల్సింది, కానీ స్థానిక పోలీస్ సిబ్బంది అనుమతి ఇవ్వలేదు. దీంతో స్థానిక కార్యకర్తలు హైకోర్టులో పిటిష‌న్ దాఖలు చేశారు. ప‌లు వాయిద‌ల త‌ర్వాత అనేక వాదోపవాదాల విన్న కోర్టు చివ‌రికి ష‌రతులతో కూడిన అనుమ‌తినిచ్చింది. దీంతో కార్యక్రమం మార్చి 5న ఘ‌నంగా నిర్వహించడం జరిగింది.

స‌ర‌స్వ‌తి శిశుమందిర్ నుంచి నిర్వ‌హించిన ప‌థ‌సంచ‌ల‌న్‌లో 500 మంది సంఘ కార్య‌కార్త‌లు ఉత్స‌హంగా పాల్గొన్నారు. ఘోష్ వాద‌న‌ల‌తో ఆయా వీధుల‌ నుండి స్వ‌యంసేవ‌కులు వెళుతున్న‌పుడు మ‌హిళ‌లు మంగ‌ళ‌హార‌తుల‌తో స్వాగ‌తం ప‌లికారు. ధ్వ‌జానికి పూలవ‌ర్షం కురిపించారు. అనంత‌రం సుభ‌ద్ర నిల‌యంలో సంఘ స్వ‌యంసేవ‌కులు చేసిన శారీరిక్ ప్ర‌ద‌ర్శ‌న‌లు జ‌నాన్ని అక‌ట్టుకున్నాయి.

ఈ సంద‌ర్భంగా కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా వ‌చ్చేసిన శ్రీ గాడి మహేష్ గారు మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంద‌ని అన్నారు. త్వరలోనే లక్ష్యమైనటువంటి పరమ వైభవ స్థితి చేరాలని ఆయ‌న ఆకాక్షించారు. అనంత‌రం ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాన వ‌క్తగా హాజ‌రైన‌ ఇతిహాస సంక‌ల‌న స‌మితి భాగ్య‌న‌గ‌ర్ సంబాగ్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శ్రీ ఇందుశేఖ‌ర్ గారు మాట్లాడుతూ
కులం, ప్రాంతం, భాష త‌దిత‌ర విభేదాల‌న్ని విడిచి సంఘ‌టిత‌మైతేనే హిందూ స‌మాజం అభివృద్ధి జ‌రుగుతుంద‌న్నారు. హిందువులంద‌రూ ఏక‌మై ముందుకు సాగితేనే ప్ర‌యోజ‌నం ఉంటుంద‌న్నారు. దేశంలో చ‌రిత్ర వ‌క్రీక‌ర‌ణ గురైంద‌ని, దానినే మ‌నం చ‌దువుతున్నామ‌న్నారు. మ‌న దేశ సంస్కృతి సాంప్ర‌దాయాలు ఎంతో గొప్ప‌వ‌న్నారు. వాటిని మ‌నం గుర్తించ‌డంలేద‌ని పాశ్చాత్య సంస్కృతిని గొప్ప‌గా భావించ‌డం దుర‌దుష్ట‌క‌ర‌మ‌న్నారు. ఇది నాటి బ్రిటిష్ వారి పాల‌న నుంచి కొన‌సాగుతుంద‌న్నారు. దాని నుంచి మ‌నం బ‌య‌ట‌ప‌డాల‌న్నారు. ఆర్.ఎస్‌.ఎస్ స్వ‌యంసేవ‌కులు ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌, దేవాల‌య ప‌రిర‌క్ష‌ణ‌, స‌నాత‌న‌మైన సంస్కృతి సాంప్రాదాయాల ప‌రిర‌క్ష‌ణ‌కు అంకిత‌భావంతో కృషిచేస్తున్నార‌న్నారు. దేశ స‌మైక్య‌త‌తో కోసం ఆర్‌.ఎస్‌.ఎస్ నిత్యం కృషి చేస్తోంద‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆర్‌.ఎస్‌.ఎస్ నిర్మ‌ల్ జిల్లా సంఘ‌చాల‌క్ శ్రీ నూక‌ల విజ‌య్‌కుమార్‌, భైంసా న‌గ‌ర సంఘ‌చాల‌క్ సాదుల కృష్ణ‌దాస్‌, త‌దిత‌రులు పాల్గొన్నారు.