Home News రాయ్‌పూర్‌లో RSS అఖిల భారతీయ సమన్వయ సమావేశాలు ఆరంభం

రాయ్‌పూర్‌లో RSS అఖిల భారతీయ సమన్వయ సమావేశాలు ఆరంభం

0
SHARE

మూడు రోజుల పాటు జరిగే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) అఖిల భారతీయ సమన్వయ సమావేశాలు శనివారం (సెప్టెంబర్ 10) ఉదయం చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాయ్‌పూర్‌లో ఉన్న శ్రీ జైనమ్ మానస్ భవన్‌లో ఆరంభమయ్యాయి. భారత మాత చిత్రపటానికి పుష్పాలను సమర్పించడం ద్వారా పూజనీయ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ జీ, సర్ కార్య‌వాహ శ్రీ దత్తాత్రేయ హోసబాలే జీ సమన్వయ సమావేశాలను ప్రారంభించారు.

RSS కు చెందిన ఐదుగురు స‌హ స‌ర్ కార్య‌వాహ‌లు డాక్టర్ కృష్ణగోపాల్ జీ, డాక్టర్ మన్‌మోహన్ వైద్య జీ, అరుణ్ కుమార్ జీ, ముకుంద జీ, రామ్‌దత్త జీ చక్రధర్, అఖిల భారతీయ కార్యకారిణి సదస్యులు భయ్యాజీ జోషి, సురేష్ సోనీ జీ, వి భాగయ్య జీ, విద్యా భారతి మహా మంత్రి గోవింద్ మహంతి జీ, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ABVP) సంఘటన్ మంత్రి ఆశిష్ చౌహాన్ జీ, మహా మంత్రి నిధి త్రిపాఠి జీ, విశ్వహిందూ ప‌రిష‌త్(VHP) కార్యకారీ అధ్యక్షులు అలోక్ కుమార్ జీ, రాష్ట్ర సేవికా సమితి ప్రముఖ్ సంచాలిక వందనీయ శాంతక్క జీ, కార్యవాహిక అన్నదానం సీతక్క జీ, సేవాభారతి మహా మంత్రి రేణు పాఠక్ జీ, భారతీయజనతాపార్టీ (BJP) జాతీయ అధ్యక్షులు జె.పి. నడ్డా జీ, మహామంత్రి సంఘటన్ బి.ఎల్ సంతోష్ జీ, భారతీయ మజ్దూర్ సంఘ్‌(BMS) అధ్యక్షులు హిరణ్మయ పాండే జీ, సంఘటన్ మంత్రి సురేందర్ జీ, భార‌తీయ కిసాన్ సంఘ్(BKS) సంఘటన్ మంత్రి దినేష్ కులకర్ణి జీ, వ‌న‌వాసి క‌ళ్యాణ్ ఆశ్ర‌మ్ అధ్యక్షులు రామచంద్ర ఖరాడి జీ, సంస్కృత భారతి సంఘటన్ మంత్రి దినేష్ కామత్‌లతో పాటుగా 36 సంస్థలకు చెందిన 240 మందికి పైగా కార్యకర్తలు సమావేశానికి హాజరయ్యారు.

ఈ సంస్థలు విద్య, ఆర్ధిక రంగం, సేవ మొదలైన వివిధ సామాజిక రంగాల్లో నిరంతరం పనిచేస్తున్నాయి. సమావేశంలో ఆయా సంస్థ‌ల ప్ర‌తినిధులు వారి సంస్థ‌ల నివేదిక‌ను, వారి విజయాల గురించి వివ‌రిస్తారు. ఈ స‌మావేశాల్లో విద్య, మేధ‌స్సు, ఆర్థిక వ్యవస్థ, సేవా, జాతీయ భద్రత మొదలైన అంశాల‌కు సంబంధించిన విష‌యాల‌ు చర్చకు వస్తాయి. పర్యావరణం, కుటుంబం ప్రబోధన్, సామాజిక సమరస‌తాకు సంబంధించిన విష‌యాల‌పై సమన్వయంతో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి అనే విషయంపై కూడా RSS అఖిల భారతీయ సమన్వయ సమావేశాలు చర్చిస్తాయి.