Home News వినుర భారతీయ వీర చరిత

వినుర భారతీయ వీర చరిత

0
SHARE

లాలా హర్ దయాళ్

పండితుడిగ యుండి పట్టాలు వదిలేసి
హరదయాళు బట్టె వీర బాట
బాంబు శిక్షణిచ్చె భారతి స్వేచ్ఛకై
వినుర భారతీయ వీర చరిత
……
లండనమెరికాలు లాల తిరుగుచును
విప్లవంబు సల్పె వీరునోలె
బాంబు శిక్షణిచ్చె భారతి స్వేచ్చకై
వినుర భారతీయ వీర చరిత

భావము

ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి సంస్కృత భాషలో పట్టభద్రులైనవారు, 1905లో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి రెండు స్కాలర్‌షిప్‌లు పొందినవారు, స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో భారతీయ తత్త్వం, సంస్కృతం ప్రొఫెసర్‌గా విద్యా బోధన చేసినవారు, అమెరికాలో భారత్ జాతీయ భావనలను రగలించడంలో కీలకమైన పాత్ర పోషించిన ‘గదర్’ దినపత్రిక వెనుక ఒక బలీయమైన శక్తిగా పనిచేసినవారు, భరత మాతకు స్వేచ్ఛ కోసం లండన్, అమెరికాలో పర్యటించినవారు. స్వరాజ్య సమరయోధులకు బాంబుల తయారీలో శిక్షణ ఇచ్చినవారు, తాను జీవించి ఉండగానే భారత్‌కు స్వాతంత్ర్యం సిద్ధించాలని ఆకాంక్షించిన బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన విప్లవకారులు లాలా హర్ దయాళ్ వీర చరిత విను ఓ భారతీయుడా!

-రాంనరేష్