పత్రిక ప్రకటన
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ సమన్వయ సమావేశాలు ఇవాళ (31 ఆగస్ట్) ఉదయం తుంగభద్రా నదీ తీరం మంత్రాలయ రాఘవేంద్రస్వామి మఠంలో (ఆంధ్రప్రదేశ్) పూజ్య స్వామి సుబుదేంద్ర తీర్థ ఆశీర్వచనాలతో ప్రారంభమయ్యాయి.
భారతదేశం ప్రపంచంలోని అన్నీ దేశాలతో పోలిస్తే అత్యంత శ్రేష్టమైన దేశమని, ఇది సాధుసంతులు, మహానుభావుల పవిత్ర కార్యక్షేత్రమని పూజ్య స్వామీజీ తమ ఆశీ ప్రసంగంలో అన్నారు. ఈ దేశం జగద్గురు స్థానంలో ఉందని, ఇది అనేక పుణ్య క్షేత్రాలకు నెలవని ఆయన అన్నారు. భారతదేశంలో వివిధత్వంలోనే ఏకత్వం కనిపిస్తుందని, అందరి కృషి వల్ల హిందూ సమాజ జాగరణ, హిందూ ధర్మ పునః ప్రతిష్టాపన త్వరగా జరగాలని స్వామీజీ ఆకాంక్షించారు.
ఈ సమన్వయ సమావేశాలు సెప్టెంబర్ 2 వరకు జరుగుతాయి. ఈ సమావేశాల్లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ కార్యకారిణి సభ్యులు, అలాగే సమాజంలోని వివిధ క్షేత్రాల్లో (సామాజిక, ధార్మిక, ఆర్ధిక, విద్య, సేవ మొదలైనవి) పనిచేస్తున్న సంస్థల అఖిలభారతీయ కార్యవర్గ సభ్యులు పాల్గొంటున్నారు.
వర్తమాన సామాజిక, ఆర్ధిక, వ్యవసాయ, పర్యావరణ పరిస్థితులు, జల సంరక్షణ మొదలైన వివిధ అంశాలపై ఈ సమావేశాల్లో చర్చ జరుగుతుంది.
– అరుణ్ కుమార్,
అఖిల భారత ప్రచార ప్రముఖ్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్