
పర్యావరణ పరిరక్షణ ప్రతి రోజు జరగవలసిన పని. కేవలం దీపావళి టపాకాయలను నిషేధిస్తే సరిపోతుందా? ఏ టపాకాయలు కాలుష్యానికి కారణమవుతున్నాయన్నది ముందుగా పర్యావరణవేత్తలు, ప్రభుత్వం నిర్ణయించాలి. అంతేకాని అన్ని టపాకాయాలపై ఏకపక్ష నిషేధం సరికాదు. అనేక సంవత్సరాలుగా టపాకాయల ఉత్పత్తిపై ఆధారపడినవారు అనేకమంది ఉన్నారు. వారికి ప్రత్యామ్నాయ ఉపాధి సంగతి ఏమిటి? ఇలాంటివి నిర్ణయించాలంటే తగినంత ముందుగా చర్చించాలి. సరిగ్గా ఆ రోజుకు ముందు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఎలా? సమగ్రమైన దృష్టి లేకుండా ఒక సమస్య పరిష్కరించబోతే మరిన్ని సమస్యలు పుట్టుకువస్తాయి. ముందుగా ఆలోచించాలి, సమగ్రమైన దృష్టి ఉండాలి, పర్యావరణవేత్తలు, టపాకాయల ఉత్పత్తిదారులు, ఇతరులతో కలిసి ఏకాభిప్రాయానికై కృషి చేయాలి.