రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ జ్యేష్ఠ ప్రచారక్ శ్రీ అప్పారావు (అప్పాజీ) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, దీర్ఘకాలంగా చికిత్స పొందుతూ హైదరాబాద్‌లోని వుడ్లాండ్ ఆస్పత్రిలో ఈ ఆదివారం (జూన్ -5) తుది శ్వాస విడిచారు. అప్పాజీ గారు 1965లో విద్యార్థిగా ఉంటూ విజయవాడలో సంఘ్ ప్రచారక్ గా కార్యాలయం చేరారు. ఆర్.ఎస్.ఎస్ కు ఆనాడు ప్రాంత కేంద్రంగా విజయవాడ ఉండేది. ప్రాంత ప్రచారక్ గా శ్రీ సోమయ్య గారు ఉండేవారు. ఆ సమయంలో ప్రాంత కార్యాలయంలో వీరు పనిచేశారు. 1973 లో భాగ్యనగర్ ప్రాంత కార్యాలయంలో ఉండి పనిచేశారు. సేవా విభాగంలో, రక్తదాన సూచీ నిర్వహణలో, ప్రాంత కేంద్రంలో శిబిరాల నిర్వహణలో వ్యవస్థలో, సుదీర్ఘ కాలం ఒక సాధారణ కార్యకర్త వలె ఆయన తన సేవలనందించారు. వందల కుటుంబాలతో సత్సంబంధాలు సజీవ సంబంధాలు కొన సాగించిన ప్రత్యేకత వారిది. వారి మరణం పట్ల పలువురు సంఘ పెద్దలు సంతాపం వ్యక్తం చేశారు. వారి భౌతిక కాయము బర్కత్ పురాలోని ప్రాంత కార్యాలయంలో సందర్శనార్థం ఉంచారు. అనంతరం అంబర్ పేట స్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగాయి.