జూన్, 4, 1989.. మాకు ప్రజస్వామ్యం ఇవ్వండి లేదా చంపేయండి అంటూ వేలాదిమంది విధ్యార్ధులు తియనన్ మన్ స్క్వేర్ లో నినదించారు. ఈ విధ్యార్ధులు ప్రాధమిక హక్కులు, ప్రజాస్వామ్య వ్యవస్థ కావాలని అడుగుతూ అక్కడ చేరారు. కానీ చైనా ప్రభుత్వం మాత్రం నినాదంలోని రెండవ కోరికైన చావునే వారికి ఇవ్వాలని నిర్ణయించుకుంది. నిరాయుధులైన ఆ విద్యార్ధులపై ట్యాంకులు, తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపించింది. చూస్తూ ఉండగానే 10వేలమందికి పైగా నెలకొరిగారు.