Home News కరీంనగర్ లో స్వయంసేవకుల సేవా కార్యక్రమాలు 

కరీంనగర్ లో స్వయంసేవకుల సేవా కార్యక్రమాలు 

0
SHARE
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ సర్ కార్యవాహ  మాననీయ భయ్యాజీ జోషి  పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఆర్.ఎస్.ఎస్ స్వయంసేవకులు వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.  వలస కార్మికులు, రోజువారి కూలి మీద ఆధారపడే కుటుంబాలు  ఎలాంటి ఇబ్బందులు పడకుండా, వారిని ఆదుకోవడానికి స్వయంసేవకులు వివిధ రకాల కూరగాయలు, నిత్యావసర వస్తువులు అందజేస్తున్నారు. ఈ విధంగా దాదాపుగా 25 లక్షల సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే కరీంనగర్ లో కూడా అనేక చోట్ల ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
 
కరోనా లాక్-డౌన్ సందర్భంగా సహాయక చర్యల్లో భాగంగా సిరిసిల్ల స్వయంసేవకులు 60 మంది రంగంలోకి దిగారు. పారిశుద్ధ్య కార్మికుల పని తగ్గించి, వారికి సహకారంగా నిలబడ్డారు. నగర కమిషనర్ సూచనల మేరకు రెండు రోజుల పాటు స్వచ్ఛసేవ కొనసాగింది. మొదటి రోజు చెరువు కట్ట నుండి రంగినేని ట్రస్ట్ వరకు రోడ్డుకు, రెండవ రోజు కొత్త బస్టాండ్ నుండి పెద్దూర్ సరిహద్దు వరకు రోడ్డుకి  ఇరువైపులా శుభ్రం చేసి తమ సేవాభావాన్ని చాటుకున్నారు. శ్రమకోర్చి చేసిన ఈ పనుల్లో స్వయంసేవకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సుమారు 4 కి.మీ.పొడవు దారిని ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తలు అద్దంలా తీర్చిదిద్దారు. రెండు రోజులు ఉదయం 5 గంటలకే మొదలైన ఈ పనులు 9 గం. వరకు కొనసాగాయి. సేవభారతి పేరున నగరంలో ఇప్పటివరకు 75 నిరుపేద కూలి కుటుంబాలని గుర్తించి బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు అందించారు.
కరీనగరం విద్యానగర్ స్వయంసేవకులు ఏప్రిల్ 12న ఆరేపల్లి గ్రామంలో సంచార జాతికి చెందిన 71 కుటుంబాలకు పప్పు మరియు నిత్యవసర వస్తువులు, కూరగాయలు అందజేశారు. 710 కిలోల బియ్యం, 71కిలోల కందిపప్పుతో సహా కూరగాయలు, ఇతర  నిత్యావసర వస్తువులు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహా సంఘచాలక్ డాక్టర్ రమణాచారి గారు విభాగ్ కార్యవాహ పాక సత్యనారాయణ గారు 25 మంది స్వయం సేవకులు పాల్గొన్నారు.
పద్మానగర్ స్వయంసేవకులు కరీంనగర్ పట్టణంలో నివసిస్తున్న నాలుగు వందల కుటుంబాలకు వారం రోజులకు సరిపడే  కూరగాయలు పంపిణీ చేశారు. అలాగే మరికొన్ని కుటుంబాలకు నిత్యావసర సరుకులు బియ్యము, పప్పు, నూనె,  కారము మొదలగు వస్తువులను ఇచ్చారు . ఈ కార్యక్రమంలో 20 మంది స్వయంసేవకులు పాల్గొన్నారు.