Home News శబరిమల దేవస్థానం తీర్పుపై అర్ ఎస్ ఎస్ పత్రిక ప్రకటన

శబరిమల దేవస్థానం తీర్పుపై అర్ ఎస్ ఎస్ పత్రిక ప్రకటన

0
SHARE
శబరిమల దేవస్థానం తీర్పుపై పత్రికా ప్రకటన

ఇటీవల శబరిమల దేవస్థానం తీర్పుపై దేశవ్యాప్తంగా అనేక అభిప్రాయాలూ, ప్రతిస్పందనలు వ్యక్తమయ్యాయి. మన దేశంలో భక్తులు అనుసరించే వివిధ దేవాలయ సంప్రదాయాల పట్ల మనందరికీ గౌరవభావం ఉంది. దానితోపాటు మనం గౌరవనీయ సర్వోన్నత న్యాయస్థానాన్ని కూడా గౌరవించాలి.

శబరిమల దేవస్థానం విషయం కూడా లక్షలాది భక్తుల విశ్వాసాలతో, అందులో మహిళలు కూడా ఉన్నారు, ముడిపడిన స్థానిక దేవాలయ సంప్రదాయానికి సంబంధించినది. తీర్పు కోసం ఈ భక్తుల విశ్వాసాలను పట్టించుకోకుండా ఉండలేము. కానీ దురదృష్టవశాత్తు కేరళ ప్రభుత్వం భక్తుల విశ్వాసాలను పట్టించుకోకుండా తీర్పును వెంటనే అమలు చేయడానికి సిద్ధమయ్యింది. దీనివల్ల సహజంగానే భక్తుల నుండి, ముఖ్యంగా మహిళల నుండి, ఆగ్రహం వ్యక్తమయింది. సంప్రదాయాన్ని బలపూర్వకంగా ఉల్లంఘించడం పట్ల వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు.

సర్వోన్నత న్యాయస్థానం తీర్పును గౌరవిస్తూనే ఈ విషయాన్ని విశ్లేషించి, ఇందులో అనుసరించదగిన చట్టపరమైన మార్గాలను అన్వేషించడానికి కలిసి ముందుకు రావాలని ఆధ్యాత్మిక, సామాజిక నేతలకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పిలుపునిస్తోంది. తమ విశ్వాసాలు, భక్తికి తగినట్లుగా పూజాపద్దతిని పాటించే తమ హక్కును గురించి వారు అధికారులకు శాంతియుతమైన మార్గంలో తెలియజేయాలి.

సురేశ్ (భయ్యాజీ) జోషి ,
అర్ ఎస్ ఎస్  సర్ కార్యవాహ

(అర్ ఎస్ ఎస్ సౌజన్యం తో)