Home News నాగపూర్ లో ప్రారంభమయిన తృతీయ వర్ష సంఘ శిక్షవర్గ

నాగపూర్ లో ప్రారంభమయిన తృతీయ వర్ష సంఘ శిక్షవర్గ

0
SHARE

“స్వయంసేవక్ జీవితంలో తృతీయ వర్ష సంఘశిక్షవర్గ ఒక ముఖ్యమైన ఘట్టం. కానీ అది ఏ విశ్వవిద్యాలయపు డిగ్రీ సర్టిఫికెట్ వంటిది కాదు. నేర్చుకునే ప్రక్రియ మన జీవితంలో ఎప్పుడు సాగుతూనే ఉంటుంది.’’ అని ఆర్ ఎస్ ఎస్ సహ సర్ కార్యవాహ్ శ్రీ దత్తాత్రేయ హోసబలే అన్నారు. నాగపూర్ లో ప్రారంభమయిన సంఘ తృతీయ వర్ష శిక్షవర్గ ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

నాగపూర్ లోని రేషమ్ బాగ్ డా. హెడ్గేవార్ స్మృతి మందిర్ ఆవరణలో సంఘ శిక్షవర్గ ప్రారంభమైంది. దేశం మొత్తం నుండి వచ్చిన 708 మంది స్వయంసేవకులు ఇందులో పాల్గొంటున్నారు.

ప్రారంభోపన్యాసంలో శ్రీ దత్తాత్రేయ హోసబలే “వర్గలో పాల్గొనాలన్నది ప్రతి స్వయంసేవక్ కల. ఈ వర్గ స్థలానికి ఎంతో ప్రత్యేకత, పవిత్రత ఉన్నాయి. ఇక్కడే సంఘ స్థాపకులు డా. హెడ్గేవార్, ద్వితీయ సర్ సంఘచాలక్ గురూజీలు వేలాదిమంది స్వయంసేవకులతో పనిచేశారు. దేశం మొత్తం నుండి వచ్చే వారితో కలిసి వర్గలో పాల్గొనడంవల్ల మనకు ఈ దేశానికి సంబంధించిన సమగ్ర భావన కలుగుతుంది’’ అని అన్నారు.

వర్గ పాలక్ అధికారి శ్రీ ముకుందాజీ మాట్లాడుతూ“సమాజంలో వివిధ సంస్థలు ఉన్నాయి. కొన్ని డబ్బుకు సంబంధించినవి అయితే మరికొన్ని ప్రచారానికి చెందినవి. కానీ ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తల ఆధారిత సంస్థ. కార్యకర్తే మా ఆధారం. వ్యక్తి నిర్మాణ ప్రక్రియ ఇక్కడ సాగుతుంది. ఈ ప్రక్రియకు ఒక విరామం అంటూ ఉండదు. ఇందులో పాలుపంచుకునేవారు నిరంతరం నేర్చుకుంటూనే ఉంటారు’’అని అన్నారు.

“25 రోజుల ఈ శిక్షణ కార్యక్రమంలో అనేక విషయాలు నేర్చుకుంటాము. ఇక్కడ అనేక విషయాలను `అనుభూతి’ చెందుతాం. ఇది అపురూపమైన అనుభవం. సంఘ శిక్షవర్గ అనేది సముద్రం వంటిది. మనం ఏ పాత్ర తీసుకువెళితే అంత నీళ్ళు తెచ్చుకోగలుగుతాం.’’

మా. భాగయ్య (అఖిల భారతీయ సహ సర్ కార్యవాహ్) శిక్షార్ధులను ఆహ్వానించారు. సర్దార్ గజేంద్ర సింగ్ (ప్రాంత సంఘచాలక్, ఉత్తరాఖండ్) వర్గ సర్వాధికారిగా వ్యవహరిస్తారు. అలాగే వర్గలో ఇతర అధికారులు –

వర్గ కార్యవాహ్ – శ్రీ. శ్యాంజీ మనోహర్ (ప్రాంత కార్యవాహ్, జోధ్ పూర్)

ముఖ్య శిక్షక్ – శ్రీ. అఖిలేష్ (సహ శారీరిక్ ప్రముఖ్, అవధ్ ప్రాంతం)

సహ ముఖ్య శిక్షక్ – శ్రీ. గంగా రాజీవ్ పాండే (సహ శారీరిక్ ప్రముఖ్ , మహాకోశల్ ప్రాంతం)

బౌద్ధిక్ ప్రముఖ్ – శ్రీ. ఉత్తమ్ ప్రకాష్ (బౌద్ధిక్ ప్రముఖ్, డిల్లీ ప్రాంతం)

సహ బౌద్ధిక్ ప్రముఖ్ – శ్రీ. కృష్ణాజీ జోషి (బౌద్ధిక్ ప్రముఖ్, ఉత్తర కర్ణాటక ప్రాంతం)

సేవ ప్రముఖ్ – శ్రీ.నావల్ కిషోర్ (క్షేత్ర సేవ ప్రముఖ్, పూర్వ ఉత్తరప్రదేశ్)

వ్యవస్థ ప్రముఖ్ – శ్రీ. సునీల్ భుల్గావ్ కర్ (ధర్మజాగరణ్  సంయోజక్, నాగపూర్ మహానగర్)

పాలక్ అధికారి – శ్రీ. ముకుంద (మా. సహ సర్ కార్యవాహ్)

వర్గ 7 జూన్, 2018న పూర్తవుతుంది.