కేరళ ఇస్లామిక్ మతోన్మాదుల చేతిలో మరో ఆర్.ఎస్.ఎస్ కార్యకర్త బలయ్యాడు. కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన ఆర్.ఎస్.ఎస్ కార్యకర్త ఎస్.సంజిత్ (27) తన భార్య, ఏడాది కుమారుడితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సమయంలో కొంత మంది ఇస్లాం మతోన్మాదులు అతనిపై దాడి చేసి భార్య, కుమారుడి కళ్ల ముందే కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు.
ఈ దాడి వెనుక ఉగ్రవాద రాడికల్ ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా రాజకీయ విభాగమైన సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా హస్తముందని స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ హత్యను చూసిన రాము(56) అనే వ్యక్తి కూడా ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు.
సంజిత్‌పై 50కి పైగా కత్తిపోట్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు. స్థానిక మీడియా నివేదికల ప్రకారం, గతంలో కూడా సంజిత్ పై దాడికి అనేక ప్రయత్నాలు జరిగినట్లు తెలుస్తోంది. ఎస్‌డిపిఐ హంతకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం మధ్యాహ్నం 2-6 గంటల వరకు మలంపుజా అసెంబ్లీ నియోజకవర్గంలో హర్తాల్‌కు బిజేపీ పిలుపునిచ్చింది
దశాబ్దాలుగా కేరళలో కమ్యూనిస్టులు, ఇస్లాంవాదులచే దాదాపు 300 మంది RSS, BJP కార్యకర్తలు హత్య చేయబడ్డారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా కేరళలోని అలప్పుజా జిల్లాలో 22 ఏళ్ల నందు కృష్ణ అనే ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తను SDPI కార్యకర్తలు దారుణంగా నరికి చంపారు. హత్య జరిగి ఇన్ని రోజులు గడుస్తున్నా ప్రధాన నిందితుడు మన్సూర్ ఇప్పటికీ పరారీలో ఉన్నాడు. మరో సహ-కుట్రదారు రఫీక్‌ను బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చేందుకు కేరళ పోలీసులు అనుమతించారని నందు కుటుంబం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
Source : HINDUPOST