Home News ఎస్.సిల పట్ల వివక్ష అంటూ వచ్చిన వార్తలో నిజం లేదు: రుద్రారం ఆలయ అధికారులు, సర్పంచ్ వివరణ 

ఎస్.సిల పట్ల వివక్ష అంటూ వచ్చిన వార్తలో నిజం లేదు: రుద్రారం ఆలయ అధికారులు, సర్పంచ్ వివరణ 

0
SHARE

హైదరాబాద్: పఠాన్ చెరు సమీపంలోని రుద్రారం గ్రామంలోని గణేశ ఆలయంలోకి ఎస్సీ వర్గానికి చెందిన శివ మాలధారులను (స్వాములను) అనుమతించకుండా కులవివక్షకు గురిచేశారంటూ ప్రచురితమైన వార్తల్లో ఏమాత్రం నిజం లేదని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు అధికారులతో పాటు గ్రామ సర్పంచ్ కూడా వివరణ ఇచ్చారు. నిజానికి ఇక్కడి నియమాల ప్రకారం ఆలయంలోని ఎవరినీ అనుమతించడం లేదని, ఇందులో కులం కోణం లేదని తెలియజేశారు. కాబట్టి కొన్ని పత్రికల్లో వచ్చినట్లుగా కులవివక్ష చూపుతూ కొందరిని మాత్రమే ఆలయంలోకి రానివ్వకపోవడం జరగలేదని వివరించారు.

Click here to Like & Follow our Facebook Page

రుద్రారం గ్రామంలో ఉన్న గణేశ ఆలయం ప్రస్తుతం ఎండోమెంట్ శాఖ ఆధీనంలో ఉంది. ఆ ఆలయ ప్రాంగణంలోనే పురాతన శివాలయం ఉంది. ఈ ఆలయాన్ని 45 ఏళ్ల తరువాత పునరుద్ధరించి అందులో శివపంచాయతనం ప్రతిష్టించారు. పంచాయతనం అంటే శివుడు, విష్ణువు, గణపతి, సూర్యుడు, దుర్గాదేవిలతో కూడుకున్నదని అర్ధం. ఇలాంటి పంచాయతనం ప్రతిష్టించినప్పుడు ఆగమశాస్త్రం ప్రకారం ఇతర దేవాలయాల కంటే కొన్ని అదనపు నియమాలు పాటించాల్సి ఉంటుంది. అందులో ముఖ్యమైనది గర్భాలయంలోనికి పూజాదికాలు నిర్వహించే పూజారి తప్ప ఇతరులెవరు ప్రవేశించడానికి వీలులేదు. ఆ పూజారి కూడా కొన్ని కఠినమైన పద్దతులు, నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఈ నియమం ప్రకారమే రుద్రారం గణేశ ఆలయం గర్భగుడిలోకి పూజారికి తప్ప ఎవరిని అనుమతించడం లేదని, కేవలం ఒక వర్గానికి మాత్రమే అనుమతి నిరాకరించారంటూ వచ్చిన వార్తలో నిజం లేదని ఆలయ కార్యనిర్వాహకులతోపాటు గ్రామ సర్పంచ్ స్పష్టం చేశారు.

Click here to download our Android App for More Updates

ఈ వార్త చదవండి: