Home News 1971 భారత్ – పాకిస్తాన్ యుద్ధ సమయంలో స్వయంసేవక్ బలిదానం

1971 భారత్ – పాకిస్తాన్ యుద్ధ సమయంలో స్వయంసేవక్ బలిదానం

0
SHARE

ఆర్ ఎస్ ఎస్ సర్ సంఘచాలక్ డా .మోహన్ జి భాగవత్ 25 ఫిబ్రవరి నాడు మీరట్ లో జరిగిన రాష్ట్రోదయ సమాగం లో మాట్లాడుతూ బంగ్లాదేశ్ యుద్ద సమయంలో ఒక స్వయంసేవక్ చేసిన బలిదానాన్ని గురించి ప్రస్తావించారు.

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని రాయిగంజ్ జిల్లా అప్పటి తూర్పు పాకిస్తాన్ (నేటి బంగ్లాదేశ్) సరిహద్దు ప్రాంతం. 1971 లో భారత్ పాకిస్తాన్ యుద్ధం ప్రారంభ సమయంలో శత్రు సైన్యాలు భారత భూభాగంలోకి చొచ్చుకొని రావడానికి చేస్తున్న ప్రయత్నాన్ని సరిహద్దులో చక్రం గ్రామంలో ఉండే చుర్ఖా ముర్ము అనే 9 వ తరగతి చదువుతున్న ఆర్ ఎస్ ఎస్ శాఖ ముఖ్యశిక్షక్ గుర్తించాడు. శత్రువుల కదలికలను దగ్గరలో ఉన్న బిఎస్ఎఫ్ స్థావరానికి తెలియచేసాడు.

దానితో అప్రమత్తమైన బిఎస్ఎఫ్ జవాన్లు కొంత మందుగుండు సామగ్రిని తాము వచ్చే లోపే సరిహద్దుకు చేర్చమని కోరడంతో  చుర్ఖా ముర్ము దాన్ని స్వయంగా అక్కడికి మోసుకెళ్ళి శత్రువులతో పోరాటం చేస్తూనే వీర మరణం పొందాడు.

స్వయంసేవక్ బలిదానానికి గుర్తుగా చక్రం గ్రామంలో ఒక స్మారక చిహ్నాన్ని సైతం ఏర్పాటు చేయడం జరిగింది.