Home News ఏకాత్మ మానవవాదము సమరసతకు తాళంచెవి లాంటిది.(సమరసత కుంభ,అయోధ్య)

ఏకాత్మ మానవవాదము సమరసతకు తాళంచెవి లాంటిది.(సమరసత కుంభ,అయోధ్య)

0
SHARE
డిశంబర్ 15,16 వ తేదీల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం,ఫైజాబాద్,అయోధ్య లోని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా అవధ్ విశ్వ విద్యాలయంలో సమరసత కుంభ జరిగింది.మొదటి రోజు శ్రీరామజన్మభూమి న్యాస్ అధ్యక్షులు మహంత్ నృత్య్ గోపాల్ దాస్ గారి అధ్యక్షతన జరిగిన ఈ కుంభలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాననీయ శ్రీ యోగి ఆదిత్యనాథ్ మహరాజ్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.ఏకాత్మ మానవవాదము సమరసతకు తాళం చెవి లాంటిదన్నారు.భారతీయ ఆధ్యాత్మిక సంగమమే ఈ కుంభ,ఎలాంటి భేద,భావాలు,అంటరానితనము, కులవివక్ష లేకుండా బంధుభావనతో జీవించాలన్నారు. వ్యాసుడు, వాల్మీకి, సంత్ రవిదాస్,కబీర్ దాస్,శంకరాచార్యులు,రామానుజాచార్యులు వంటి మహాత్ముల పరంపరను మరిచిపోరాదని వారి భోదనలు చూపిన మార్గాన్ని ఆచార,వ్యవహారాల్లో చూపించాలన్నారు.పుణ్యభూమి అయోధ్య నుండి సమరసత యొక్క సందేశాన్ని విశ్వవ్యాప్ చేయాలని పిలుపునిచ్చారు.దేశానికి ,ప్రపంచానికి సమరసతతో మానవ కళ్యాణం జరుగుతుందనే సందేశాన్నివ్వడానికి ఈ కుంభ ఏర్పాటయ్యిందన్నారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారత సహ సర్ కార్యవాహ మాననీయ శ్రీ భాగయ్య గారు మాట్లాడుతూ ఒకే జాతి,ఒకే దేశము,ఒకే రక్తము,అందరిలో ఒకే పరమాత్మను దర్శించినపుడు అంటరానితనము ఉండదన్నారు.”హిందువులెవ్వరు అంటరానివారు కాదు,నా దీక్ష హిందూ ధర్మ రక్షణ,నా మంత్రము సమానత్వము”అని గురూజీ చెప్పిన మంత్రాన్ని సమాజంలోకి తీసుకు వెళ్ళవలసిన అవసరం ఉందన్నారు.విదేశీయులు,విధర్మీయులు భారయదేశాన్ని కులాలపేరిట విడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు.కాని మనం అందరం కలిసి ఏకాత్మ సమాజాన్ని నిర్మించడానికి కృషి చేయాలన్నారు.విద్యాలయం,దేవాలయం,జలాశయం,స్మశానం అందరికి సమానంగా ఉండాలని భేదబావాలుండరాదన్నారు.
రెండవ రోజు జరిగిన కార్యక్రమానికి కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి థావర్ చంద్ గహ్లోత్ అధ్యక్షత వహించారు.ఇందులో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సహసర్ కార్యవాహ మాననీయ కృష్ణగోపాల్ జీ మాట్లాడుతూ మన ఇంటితో పాటు సమాజం మొత్తంలో అంటరానితనాన్ని రూపుమాపి సమరసత స్వరాన్ని వినిపించాలన్నారు.అందరిలోను ఒకే పరమాత్మ తత్వాన్ని సమరసత కుంభ ద్వారా పొంది హిందూ సమాజంలోని అస్పృశ్యతను తొలగించడానికి విశేష ప్రయత్నం చేయాలన్నారు.
సమరసత కుంభలో చిలుకూరి బాలాజి,భాగ్యనగరం ఆలయ వేదపండితులు శ్రీ రంగరాజన్ గారు మాట్లాడుతూ ఎస్ సి వర్గానికి చెందిన వ్యక్తి ని తన భుజాలపై మోసుకుంటూ వెళ్లి దేవాలయ ప్రవేశం చేయించానన్నారు. ఈ మునివాహాన సేవ ద్వార సమాజానికి సమరసతను చాటి చెప్పానన్నారు.చండాలుడుండేడి మరుభూమి ఒకటే అనే అన్నమయ్య కీర్తన ద్వార భేద భావాలు అస్పృశ్యత ఉండరాదని అన్నారు.పరమేశ్వరుడు స్వయంగా చండాలుని రూపంలో వచ్చి ఆది శంకరాచార్యులకు సమరసత పాఠాలు నేర్పారని చెప్పారు.
*సమరసత కుంభలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి మాననియ శ్రీ యోగి ఆదిత్యనాథ్ సమరసత పుస్తకాన్ని ఆవిష్కరించారు.
*ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారు,రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ గారు ఈ కుంభకు పంపిన సమరసత సందేశాన్ని ఆచార్య సంజయ్ పాశ్వాన్ గారు చదివి వినిపించారు.
*సమాజంలో సమరసత నిర్మాణం చేయడానికి విశేష కృషి చేసిన పలువురిని ఈ కుంభ వేదిక పై ఘనంగా సన్మానించారు.తెలంగాణ రాష్ట్రానికి చెందిన చిలుకూరి బాలాజీ ఆలయం వేద పండితులు,అర్చకులు శ్రీరంగరాజన్ గారు ఈ సన్మానం అందుకున్నారు.2700 సంవత్సరాల క్రితము జరిగిన  మునివాహన సేవ ను మళ్లీ    కొనసాగించి ప్రపంచ ప్రసంశలు అందుకున్న శ్రీ రంగరాజన్  గారికి సత్కారం లభించింది.
*డాక్టర్ రామ్ మనోహర్ లోహియా విశ్వ విద్యాలయ కులపతి ఆచార్య మనోజ్ దీక్షిత్ గారు, ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు రమాపతి శాస్త్రీ గార్ల పర్యవేక్షణలో జరిగిన ఈ సమరసత కుంభలో దేశం మొత్తం నుండి 5 వేల మంది సామాజిక సమరసత కొరకు పనిచేస్తున్న కార్యకర్తలు పాల్గొన్నారు.
*సామాజిక సమరసత వేదిక తెలంగాణ ప్రాంత ప్రముఖ్ శ్రీ అప్పాల ప్రసాద్ జీ,ప్రాంత ఉపాధ్యక్షులు సత్యనారాయణ జీ  నేతృత్వంలో  తెలంగాణ రాష్ట్రం నుండి సామాజిక సమరసత యొక్క వివిధ బాద్యతలకు చెందిన 54 మంది ఈ సమరసత కుంభలో పాల్గొన్నారు.