స్వామి వివేకానంద జయంతి సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో సందర్భంగా 8 జనవరి నుండి 12 వరకు ‘సేవా – సమరసత’ అంశంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా వేల మందికి సమరసత మరియు వివేకానందుడి సందేశాన్ని అందించారు.
ఈ సందర్భంగా పలు జిల్లాల్లో ప్రధాన వక్తగా పాల్గొన్న సమరసత వేదిక తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ మాట్లాడుతూ నిరుపేద, ధీన జనులకు తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు, కరుణాంతరంగుడు స్వామి వివేకానంద అని, ఆ మహనీయుని అడుగుజాడల్లో నడుస్తూ ఈ సంవత్సరం సామాజిక సమరసత వేదిక సేవా -సమరసతలకు ప్రతీకలుగా తెలంగాణలో వివేకానంద జయంతిని నిర్వహించి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు.
సామజిక సమరసత ఆధ్వర్యంలో వివిధ జిల్లాల్లో నిర్వహించిన సేవా కార్యక్రమాలు:
వరంగల్ జిల్లా హన్మకొండలోని ‘అతిథి దివ్యాంగుల ఆశ్రమం’లో 30 మంది మానసిక వికలాంగ విద్యార్థులకు వేదిక కార్యకర్తలు మాతంగి రమేష్ బాబు, క్రాంతికుమార్ పండ్లు పంపిణీ చేశారు.
భాగ్యనగరంలోని చాదర్ ఘాట్ వద్ద 1902 లో బాగ్యరెడ్డి వర్మ స్థాపించిన పాఠశాలలో మరియు ముషీరాబాద్, బర్కత్ పురా ప్రాంతాల్లోని ఎస్సీ బాలికల వసతి గృహాల్లో జనవరి 9 2019న పరీక్ష ప్యాడ్లను అందచేశారు. వేదిక కార్యదర్శి హర్షవర్దన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి.
*సిద్దిపేట్ జిల్లా దుబ్బాకలో 700 మంది, అందెలో 80 మంది విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు,పెన్నులు అందచేశారు. సామాజిక సమరసత వేదిక ప్రతినిధులు రమేష్ ఆద్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి.
*మెదక్ జిల్లా రాజ్ పల్లిలో 96 మంది, రాజ్ పేటలో 20 మంది విద్యార్థులకు పరీక్షప్యాడ్లు, పెన్నులు, రాత పుస్తకాలు అందచేశారు. వేదిక కార్యకర్తలు ధన్ రాజ్, మత్స్యేంద్రనాథ్, సాయిబాబ ఆద్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి.
*రామాయంపేట్ దాసరి బస్తీలో 30 మంది పేద విద్యార్థులకు రాత పుస్తకాలు అందచేశారు. వేదిక కార్యకర్తలు భైరం నర్సింలు, సాంగని యాదగిరిల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
*నాగర్ కర్నూల్, గగ్గలపల్లిలో 120 మంది విద్యార్థులకు పరీక్షప్యాడ్లు అందచేశారు. వేదిక కార్యకర్త మధు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
సామజిక సమరసత ఆధ్వర్యంలో 2k రన్:
స్వామి వివేకానంద జయంతి సందర్భంగా సిద్దిపేట్, ఖమ్మం జిల్లాల్లో 2k రన్ (రెండు కిలోమీటర్ల పరుగు) నిర్వహించారు. ఖమ్మంలోని 8 విద్యా సంస్థల నుండి 500 మందికి పైగా విద్యార్థులు ఈ పరుగులో పాల్గొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షులు సులోచనారావ్, సేవాభారతి అధ్యక్షులు మోతె నారాయణ, వేదిక రాష్ట్ర కార్యదర్శి జైపాల్ రెడ్డి పాల్గొన్నారు.
సిద్దిపేట్ జిల్లాలో నిర్వహించిన సమరసత పరుగులో 400 మంది యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పరుగుని పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్లు నందీశ్వర్ రెడ్డి, ఆంజనేయులు, ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్, వేదిక జిల్లా అధ్యక్షులు రత్నంలు జెండా ఊపి ప్రారంభించారు.
వివిధ పోటీల నిర్వహాణ – బహుమతుల అందచేత:
జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో సాంఘీక సంక్షేమ బాలికల పాఠశాల, బోయవాడ, మెట్ల చిట్టాపూర్లలోని జిల్లా పరిషత్ పాఠశాలల్లో వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించి 63 స్టీల్ పాత్రలు విజేతలకు బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమాల్లో 800 మంది పాల్గొన్నారు.
మెదక్ జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ బాలుర వసతి గృహం విద్యార్థులకు మరియు బాలానగర్ గ్రామంలోని యువకులకు కబడ్డీ, వాలీబాల్ పోటీలు, రాజ్ పేట్ లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమాల్లో 180 మంది పాల్గొన్నారు.
గజ్వేల్ లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించి వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల నరేష్ బాబు బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో 400మంది పాల్గొన్నారు.
భువనగిరి జిల్లా ఆలేరులో ప్రభుత్వ ఉన్నత పాఠశాల,కళాశాలల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతు లుగా వివేకానంద సాహిత్య పుస్తకాలు అందచేశారు.
వేదిక ఆధ్వ్యర్యంలో విభిన్న కార్యక్రమాలు:
స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ‘సమాజంలో సామరస్యం – పౌరుల పాత్ర’ అనే అంశంపై వరంగల్ నగరంలో చర్చావేదిక నిర్వహించారు.
మెదక్ రాందాస్ చౌరస్తాలో వివేకానంద జయంతి రోజున ‘మానవహారం’ మరియు బాలానగర్ లో శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో 200 మంది పాల్గొన్నారు.
ఖమ్మం జిల్లా బోనకల్ గ్రామంలో ‘యువ ఆదర్శ రైతు’ను సమరసతా వేదిక వేదిక సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో 30 మంది పాల్గొన్నారు.
స్వామి వివేకానంద జయంతి రోజున తెలంగాణలోని అనంతగిరి, ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట్, మెదక్, సంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట్, నాగర్ కర్నూల్, వికారాబాద్, పాలమూరు, వరంగల్, కరీనగర్, జగిత్యాల, జనగామ, భాగ్యనగరం, భువనగిరి, యాదాద్రి, భద్రాచలం తదితర జిల్లాల్లో సామాజిక సమరసత వేదిక కార్యకర్తలు వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి సమర్పించారు. సామజిక సమరసత యొక్క ఆవశ్యకతను వివరించారు.
వివేకానంద జయంతి ఉత్సవాల సందర్భంగా సమరసతా వేదిక సుమారు 7 వేల మందికి ‘సమరసత – వివేకానందుడి సందేశం’ అందించింది.