
శ్రీ విష్ణుహరి దాల్మియా స్వర్గస్తులయ్యారన్న విషాదకర వార్త మన మనస్సుల్లో బాధతో కూడిన ఒక వెలితిని కలిగించింది. ప్రస్తుత తరంతోపాటు మూడు తరాల వారు ఆయన సాగించిన సామాజిక కృషిని ప్రత్యక్షంగా చూశారు. ధార్మిక రంగంలోనేకాక మిగిలిన అన్ని రంగాలలో పనిచేసిన కార్యకర్తలకు విశ్వహిందూ పరిషత్ అధ్యక్షులుగా ఆయన ఆత్మీయ మార్గదర్శనం లభించింది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నిశ్చలంగా, శాంతియుతంగా పనిచేసుకుపోయే ఆయన తత్వం మనందరికీ తెలుసు. ఆయన మరణంతో ఒక జ్యేష్ఠ మార్గదర్శకుడిని మనం కోల్పోయాము. `ఈశ్వరేచ్చా బలీయసి’. ఈ దుఃఖాన్ని సహించి, ఆయన అనుసరించిన జీవన విలువలను మరింత ముందుకు తీసుకువెళ్ళేందుకు తగిన ధైర్యాన్ని భగవంతుడు మనకు ఇవ్వాలని కోరుతూ ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని వ్యక్తిగతంగా, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తరఫున శ్రద్ధాంజలి సమర్పిస్తున్నాను.
– మోహన్ భాగవత్, సర్ సంఘచాలక్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్.