సంస్కృతీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివేక్ బ్యాండ్ ‘బీ గుడ్.. డూ గుడ్’ (మంచిగా నడుచుకుందాం.. మంచిని పంచుదాం” 15 రోజుల స్వస్తి/ ముగింపు కార్యక్రమము 23.01.2019 హైదరాబాద్ రామకృష్ణ మఠం ఆడిటోరియంలో ఎంతో చక్కటి వాతావరణంలో స్వామీజీల ఆశీస్సులతో జరిగింది.
ఉదయం గం. 11.00 నుండి 1.౩౦ గం. వరకు జరిగిన ఈ కార్యక్రమంలో షుమారుగా 15 ఇంజనీరింగ్ కాలేజీలు, 2 మెడికల్ కాలేజీలు, 2 పీజీ కాలేజీలు, 1 డిగ్రీ కాలేజీ మరియు కరీంనగర్, ఇతర తెలంగాణా ప్రాంతాల నుంచి మొత్తంగా 1250 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగినది. మరియు 50 మంది వరకు కాలేజీలకు సంమంధించిన ఫాకల్టీ, NSS వారు పాల్గొన్నారు.
కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ అనిల్ రెడ్డిగారు పాల్గొన్నారు.
శ్రీ ఆనందరాజు గారు సంస్కృతీ ఫౌండేషన్ చేస్తున్న వివిధ కార్యక్రమాలను గురించి వివరించి వివేక్ బ్యాండ్ యొక్క అవసరాన్ని ప్రస్తుత యువత సమాజంలో మంచి చేయడము మంచిగా ఉండి సమాజ మంచి కోసం ఏవిధంగా పాటుపడాలి అనే విషయాన్నితెలియ చేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తలుగా శ్రీశ్రీశ్రీ స్వామి తత్వార్ధనంద, శ్రీ రాకా సుధాకర్, ప్రముఖ జాతీయతావాద పాత్రికేయులు, శ్రీమతి వైశాలి మల్హోత్రా గారు IRS వ్యవహరించి విద్యార్థులను ఎంతో అలరించి కార్యోన్ముఖులుగా చేయడం అందరికి ఆనంద దాయకం.
శ్రీ స్వామిజి మాట్లాడుతూ భారతీయ విలువలను తన మొదటి ప్రసంగం లోనే ప్రపంచ మతాలకు తెలియ చేసిన జగత్విఖ్యాతులు, ఎవరి మాటలతో ఆనాటి యువత ఉద్వేగాన్ని కలిగి ఉరకలు తీసి భారత దాస్య బంధనా లను తెంచి వేయాలని ఆత్రుత వ్యకతం చేసిందో ఆ మహా మహుడు తన ముగ్ద మనోహర ప్రసంగాల ద్వారా ఆనాటి పశ్చిమ దేశాలను ఏవిధంగా ప్రభావితం చేసింది ఆసాంతం ఎంతో చక్కటి ఆంగ్ల సంభాషణను చేయడం విద్యార్థులలో మంచి స్పందనను రేకెత్తించింది. శ్రీ స్వామిజి తన చికాగో ప్రసంగంతో ప్రపంచ జనులను ఎంతగానో ఆకర్షించి తద్వారా భారత సంస్కృతీ నాగరికతలు ప్రపంచానికి ఏవిధంగా తెలియ చేయగలిగారో వివరించడం జరిగినది.
శ్రీ రాకా సుధాకర్ గారు తన ప్రసంగం ద్వారా సేవా భావం అంటే ఎలా ఉంటుంది, ఎన్ని రకాలుగా సేవను చేయ వచ్చును తెలుపుతూ ఉదాహరణగా ఒక సెక్యూరిటీ గార్డు తన కొద్దిపాటి సంపాదనలో భారత సైన్యానికి ఎనలేని సేవను ఎలా చేశారో తెలియ పరిచారు. ఆ సెక్యూరిటీ గార్డు, టెర్రరిస్టు దాడులకు గురై అసువులు బాసిన సైనిక కుటుంబాలను పరామర్శించడం, వారి కుటుంబాలకు సంతాపం తెలుపుతూ వుత్తరం రాయడం ద్వారా దాదాపుగా ఇరవై వేలమంది డాటాను కలిగి ఉండి, సంవత్సరానికి 370 ఉత్తరాలు కేవలం తన కొద్దిపాటి సంపాదనతో చేయడం, తెలిపిన విధానం విద్యార్థులను ఎంతో కదిలించింది.
వారు ప్రసంగాన్ని కొనసాగిస్తూ మరో ఉదాహరణను తెలుపుతూ, కర్నూలు పట్టణంలో బస్టాండు వద్ద పల్లీలు అమ్ముకొనే వ్యక్తి పల్లీలు అమ్ముతూ తాను చుట్టి ఇచ్చే కాగితం కాక రెండవ పేపరు కూడా ఆ చుట్టాలో కలిపి ఇస్తూ తనవద్ద కొన్న ప్రతి వారికి మీరు పల్లీలు తిన్న తరువాత చెత్తను రెండవ చుట్టిన కాగితంలో వేసి ప్రక్కన చెత్త బుట్టలో వేయగలరు అని కోరడం ద్వారా తన వంతు సమాజానికి సేవ ఏవిధంగా చేస్తున్నారో చక్కటి తెలుగు భాషలో వివరించిన వెంటనే విద్యార్థులు ఎంతో స్పందన తెలుపుతూ చప్పట్లు చరచడం అందరికి ఆనందాన్ని కలిగించింది.
అలానే మణిపూర్ ప్రాంతంలో 92 సంవత్సరాల ముదుసలి వారి జిల్లా కలెక్టారుకు తాము కొన్ని వందల సంవత్సరాలుగా కోహిమా నుంచి 100 కిలోమీటర్లు నడిచి రావడం జరుగుతోంది మీరు దయ ఉంచి మాకు మార్గం వేయించగలరు అని తెలిపిన వెంటనే ఆ రహదారిని నిర్మాణం చేసి వారి దూరం తగ్గించి ఆ ఊరికి ఉపకారం కలిగించడం అనే విషయం విన్న విద్యార్థులను ఎంతో కదిలించింది. సేవ అనే దానికి వయస్సుతో నిమిత్తం లేదు మనస్సు ఉంటే చాలు అనేది గ్రహించడం ద్వారా విద్యార్థులు చప్పట్లతో హాలు మారు మ్రోగింది.
తన ప్రసంగం ఇంకో చిన్న ఉదాహరణతో ప్రతి వారి పేరుతోనూ రామనామ జపం చేరుతుంది అని కూడా లెక్కల ద్వారా తెలిపి విద్యార్థులను ఎంతో అలరించి వారి కార్యన్ముఖులను చేసిందనే అందరు అనుకోవడం ఎంతో ఆనందించ వలసిన విషయం.
కొసమెరుపు కొంతమంది విద్యార్థులు నా వద్దకు వచ్చి మేము కూడా ఇంకా ముందు సేవా కార్యక్రమాల్లో మనస్సును లగ్నం చేసి పాల్గొంటాము అని ముందుకు రావడం ముదావహం.
శ్రీమతి వైశాలి మల్హోత్రాగారు తమ ప్రసంగంలో విద్యార్థులు తమ చదువులను ఏవిధంగా కొనసాగించాలి, గొప్ప పదవులకు వారు ఏవిధంగా ఎదగాలి అని తెలుపుతూ, పదవులు అలంకరించిన తరువాత ప్రజలకు, సమాజానికి ఏవిధమైన సేవలను అందించగలము అని తెలుపుతూ, స్వామి వివేకానందులు తెలిపిన విధంగా గొప్ప ఆశయాలు ఎప్పుడు మదిలో కలిగి ఉంటే వాటి సాకారం ఈ పదవులద్వారా సాదించండం ఎంత సులువు అవుతుందో తనను తనతోటివారిని ఉదాహరణగా తెలియ పరచడంతో కొంతమంది విద్యార్దునులు ఎంతో ఉత్సుకతతో మేము మేడంగారితో ఎప్పుడైనా కలవగలమా మాకు వారి సహకారం ఉంటే తప్పక మేముకూడా ఐఏఎస్ కు తయారవుతాము అని తెలపడమే, వైశాలిజీ విద్యార్థునులను ఏ విధంగా ప్రభావితం చేశారో అర్ధమవుతుంది. కొసమెరుపుగా తన ప్రసంగ చివరిలో విద్యార్థులు అందరి చేతా జై హింద్ అని ముక్తకంఠ నినాదం చేయించడం సంతోషదాయకం.
శ్రీ జి నటరాజ్, శ్రీమతి సుభద్రా శ్రీనివాస్, శ్రీ భౌమిక్ దేశాయ్ చక్కటి యానకరింగ్ తోటి విద్యార్థులను క్రమశిక్షణతో మెలిగేలా చేసి, విద్యార్థులకు పెద్దల ద్వారా ప్రశంసా పత్రాలను అందింపచేయడం, పేరు పేరున కాలేజీ వారిని పిలిచి వారి ఫోటోలను పెద్దలతో కలిసి తీయించి వారిలో ఉత్సాహాన్ని నింపడం నిజంగా మరపురాని చితంగా నిలిచిపోతుంది. శ్రీమతి నాగ ప్రశాంతి, అడ్వకేట్, తెలంగాణా హై కోర్ట్ వారు కూడా సహకరించడం జరిగింది.
Dr పీ విష్ణుదేవ్ గారు, రాష్ట్ర NSS ఆఫీసరు, తెలంగాణా ప్రాంతం సభా ప్రాంగణానికి విచ్చేసి విద్యార్థులు, NSS కోఆర్డినేటరులతో ముచ్చటించి సంస్కృతీ ఫౌండేషన్ వారి మాదిరిగా మనం కూడా విద్యార్థులను కలిపి వారిలో ఉత్సాహాన్ని నింపాలని తెలియచేస్తూ ఇక ముందు కూడా ఈ విధమైన చక్కటి కార్యక్రమాలు చేయించాలని మేము కూడా మా వంతు సహకారాన్ని అందిస్తామని వారు మాట ఇవ్వడం మా యొక్క ఫౌండేషన్ వారికి సంతోష దాయకం అని తెలియపరచడం జరిగింది. రాష్ట్ర గీతం జనగణమన తో కార్యక్రమం ముగిసింది.
కార్యక్రమం అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు, కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు అందరు కూడా కలసిమెలసి భోజనం చేస్తూ మంచి విషయాలు ఆ చెట్లక్రింద మంచి ఆహ్లాదకర వాతావరణంలో చర్చించుకుంటూ భవిష్యత్తులో చేయవలసిన సేవా కార్యాలను విద్యార్థులు తెలియ పరుస్తుంటే ఎంతో ముచ్చట గొలిపినిన ఆ దృశ్యం వర్ణనకు అండనిదిగా ఉంది. కొంతమంది విద్యార్థులు మేము ఈ విధంగా భోజనం చేయడానికి మీతో కలసి ముచ్చటించడానికి కూడా రావాలనుంది అనడం సంతోష దాయకం.
ఈ కార్యక్రమం లో శ్రీ దుర్గారెడ్డి గారు ప్రముఖ పారిశ్రామిక వేత్త, శ్రీ సురేందర్ రెడ్డి గారు, మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్ వ్యవస్థాపక అధ్యక్షులు, శ్రీ యజ్ఞనారాయణ శర్మ గారు, ప్రజ్ఞా భారతి, శ్రీ భోజనపల్లి నరసింహమూర్తి గారు, సంస్కృతీ ఫౌండేషన్ చీఫ్ కోఆర్డినేటర్, శ్రీ వనజ కుమార్, సెక్రటరీ, సంస్కృతీ ఫౌండేషన్, వివేక్ బ్యాండ్ కార్యక్రమ కోఆర్డినేటర్,శ్రీ శ్రీధర చాణుక్య, శ్రీ అభినవ్, శ్రీ సంతోష్, శ్రీ రాఘవేంద్ర, శ్రీ అజయ్ పాల్గొన్నారు. శ్రీ కొంపేర్ల రామమూర్తి గారు కూడా పాల్గొని సంస్కృతీ ఫౌండేషన్ సభ్యులు అందరిని ఉత్సాహపరచడం సంతోషదాయకం.