Home News సందేశ్ ఖాళీ – రాజకీయ నరమేధం

సందేశ్ ఖాళీ – రాజకీయ నరమేధం

0
SHARE
  • మహిళలు, బాలిక‌లపై భయానక అమానవీయ చర్యలు
  • హిందువులే ల‌క్ష్యంగా చేసుకుని దాడుల‌కు పాల్ప‌డుతున్న ఉగ్ర‌వాద సంస్థ‌లు
  • అధికార పార్టీ నాయ‌కులు, అధికారుల అండ‌దండ‌ల‌తో చెల‌రేగిపోతున్న విద్రోహ శ‌క్తులు

సందేశ్ ఖాళీ పశ్చిమ బెంగాల్ లోని 24 పరగణాల జిల్లాలో ఉన్న ఒక చిన్న పట్టణం. ఇది బంగ్లాదేశ్ సరిహద్దుకు ఆనుకొని ఉన్న సరిహద్దు ప్రాంతం. ఇక్కడ హిందూ షెడ్యూల్డ్ కులాల జనాభా ఎక్కువగా ఉంటుంది. భారత్ మ‌రియు బంగ్లాదేశ్ కు ఆనుకొని ఉన్న పశ్చిమ బెంగాల్ లోని 14 శాసనసభ నియోజకవర్గాలలో సందేశ్ ఖాళీని చేర్చారు. దురదృష్టవశాత్తు, సందేశ్ ఖాళీతో సహా ఈ శాసనసభ నియోజకవర్గాలన్నీ TMC మద్దతుతో ప్రణాళిక బద్ధమైన కుట్రలో భాగమయ్యాయి. ఈ 14 సరిహద్దు శాసనసభా నియోజకవర్గాలలో బంగ్లాదేశ్ నుండి అక్రమ చొరబాట్లు గణనీయంగా పెరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అక్కడి జనాభాను మార్చే కుట్ర జరుగుతోంది. వాస్తవానికి ఈ ప్రాంతం పాకిస్తాన్ గూడచార సంస్థ ISI ఉగ్రవాద కార్యకలాపాలతో పాటు అనేక నేర కార్యకలాపాలకు కేంద్రంగా మారుతోంది . కొంతకాలం క్రితం వరకు, సందేశ్ ఖాళీలో ముస్లిం జనాభా చాలా తక్కువగా ఉంది, కానీ అక్రమ చొరబాట్ల కారణంగా, ఇక్కడ సంఘ వ్యతిరేక శక్తుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ఈ ప్రాంతం జనాభా మార్పులకు లోనైంది. ఇందులో అత్యధిక జనాభా రోహింగ్యాలదే.

గత ఎన్నికల సమయంలో జరిగిన నేర సంఘటనలన్నింటిలో నేరస్తులలో ఎక్కువ మంది సంఘ వ్యతిరేక ముస్లింలే కావడం గమనార్హం. ఈ కేసులు గోవుల అపహరణ, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, అక్రమ ఆయుధాల స్మగ్లింగ్ ఇలాంటి చట్టవ్యతిరేకమైన కేసుల్లో ముస్లింలు నిందితులుగా ఉన్నారు. సందేశ్ ఖాళీలో ఏదైతే జరిగిందో లేదా జరుగుతున్నదో అది మొదటిసారి జరగలేదు. దీనికన్నా ముందు 2000 సంవత్సరంలో దక్షిణ 24 పరగణాల బసంతి శాసనసభ నియోజకవర్గంలో ఒక హిందూ షెడ్యూల్డ్ కుల మహిళపై సంఘ వ్యతిరేక ముస్లింలు సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటనకు వ్యతిరేకంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తలు బహిరంగంగానే గొంతెత్తారు. ఫలితంగా, ముస్లిం రేపిస్టులు నలుగురు ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తలను హత్య చేశారు.

హిందూ మహిళలపై ఒకటి కాదు వందల సంఖ్యలో సామూహిక అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. వీటికి వ్యతిరేకంగా ఎప్పుడైతే ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తలు స్వరం పెంచారో, ఫలితంగా వారిపై దాడుల‌కు దిగ‌డం ప్రారంభించారు. దాడులు, హత్యలు చేయడమే కాకుండా వారి ఇళ్లను కూడా తగులబెట్టారు. అక్రమ చొరబాటుదారులు ఈ ప్రాంతంలో ఎంతగా బీభత్సం సృష్టించారంటే 2007లో జరిగిన అల్లర్లను అరికట్టడానికి BSF సహాయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ ప్రాంతంలో హిందువులపై జరిగిన అత్యాచారాలు, అణిచివేతల జాబితా ఎక్కువ‌గానే ఉంది. 2017 లో సోషల్ మీడియాలో వచ్చిన పోస్టు కారణంగా హిందువులపై దాడుల‌కు పాల్ప‌డ్డారు.

ఇక్కడ హిందూ షెడ్యూల్డ్ కులాల స్త్రీలను, మైనర్ బాలికలను ఆ ప్రాంతంలోని శక్తివంతమైన చొరబాటుదారులు బలవంతంగా ఎత్తుకు వెళ్తారు. ఈ ప్రాంతంలో మాదకద్రవ్యాలు, ఆయుధాలు, గోమాంసం స్మగ్లింగ్ వంటి నేరాలకు పాల్పడే షేక్ షాజ‌హాన్ వంటి ముస్లిం గ్యాంగ్ స్టర్లు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. రోహింగ్యా, బంగ్లాదేశ్ చొరబాటుదారులను స్థిరపడేటట్లు చేయడం, డజన్ల కొద్ది నేర, అమానవీయ కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్న షేక్ షాజ‌హాన్ వంటి వారు అక్రమ సంపాదనతో బిలియన్ల విలువైన అక్రమ ఆస్తులను సంపాదించారు. ఇంతకుముందు ఈ వ్యక్తులు కమ్యూనిస్టు పార్టీలో ఉన్నారు. ఇప్పుడు వారు తృణమూల్ కాంగ్రెస్ నాయకులు. షేక్ షాజ‌హాన్ రహస్య స్థావరాలపై దాడులు చేసేందుకు వెళ్లిన ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) బృందంపై వారి అనుచరులు దాడి చేయడంతో పలువురు అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. షేక్ షాజ‌హాన్, అతని అనుచరులు దళిత మహిళలను, మైనర్ బాలికలను కిడ్నాప్ చేసి వారి రహస్య స్థలాలకు, తృణమూల్ కాంగ్రెస్ కార్యాలయాలకు తీసుకువెళ్లి అక్కడ వారంతా నెలల తరబడి ఆ మహిళలు, మైనర్ బాలికలపై సామూహిక అత్యాచారం చేశారు. ఉద్యోగం, ఉపాధి, విభిన్న ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు, పార్టీలో పదవుల ముసుగులో అనేక మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయి.

ఆధునిక ప్రజాస్వామ్య కాలంలో, మధ్యయుగ కాలం నాటి పాలనను నడుపుతున్న ఈ నేరస్తులకు ప్రభుత్వ అధికారుల, అధికార పార్టీ-తృణమూల్ కాంగ్రెస్ నుండి ప్రోత్సాహం, మద్దతు, రక్షణ లభిస్తున్నది. బషీర్ హాట్ కు చెందిన ప్రస్తుత S .P హుస్సేన్ మెహందీ రెహమాన్ వంటి అధికారులు వీరి ఆగడాలను ప్రోత్సహించే వారిలో చేరారు. వీరికి వ్యతిరేకంగా ఎవరైనా గళం విప్పితే వారి పట్ల క్రూరమైన హింసకు పాల్పడుతున్నారు. ఆస్పత్రులలో వారు చికిత్స చేసుకోకుండా అడ్డుకుంటున్నారు. ఎఫ్.ఐ.ఆర్ కూడా నమోదు కానివ్వరు. ఈ దారుణాలకు వ్యతిరేకంగా గళం విప్పిన బాధితులు, వారిపై న‌కిలీ ఎఫ్.ఐ.ఆర్ లు నమోదు చేస్తున్నారని, ఈ దారుణమైన ఘటనలను ఆర్.ఎస్.ఎస్, బి.జె.పి చేస్తున్న ప్రచారంగా చెబుతూ దుష్ప్రచారం చేస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పిలుపుమేరకు, రాష్ట్ర పోలీసులు ఆ ప్రాంతమంతా చుట్టుముట్టారు. ఎవరినీ బయటకు వెళ్లడానికి అనుమతించలేదు. బయట నుండి ఎవరినీ అక్కడికి వెళ్ళనీయలేదు.

జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్, జాతీయ మహిళా కమిషన్, బి.జె.పి మహిళా కార్యకర్తల ప్రతినిధి బృందాన్ని కూడా సంఘటనా స్థలానికి చేరుకోనివ్వలేదు. దీంతో వారు రాష్ట్రపతి పాలన విధించాలని సిఫారసు చేశారు. సుప్రీంకోర్టు, కోల్ కతా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసి నిష్పాక్షిక దర్యాప్తు కోసం డిమాండ్ చేశారు. పశ్చిమ బెంగాల్లోని ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు, ఉత్తర దినాజ్ పూర్, దక్షిణ దినాజ్ పూర్, ముర్షిదాబాద్, మాల్దా, నదియా, హుబ్లీ వంటి సరిహద్దు లేదా ముస్లిం ఆదిపత్య జిల్లాలలో ఇటువంటి సంఘటనలు నిరంతరం వెలుగులోకి వస్తున్నాయి. హిందువులపై ఊచకోత, మతపరమైన, సామాజిక, శారీరక అణిచివేత ఇళ్లను తగులబెట్టడం, హిందూ మహిళలు, మైనర్ బాలికలపై సామూహిక అత్యాచారం వంటి ప్రణాళికా బద్ధమైన సంఘటనల కారణంగా స్థానిక హిందువుల వలసలు కూడా ప్రారంభమయ్యాయి. ముస్లిం ఓటు బ్యాంకు కారణంగా, గతంలో కమ్యూనిస్టు ప్రభుత్వము మరియు ప్రస్తుత మమతా బెనర్జీ ప్రభుత్వం రెండూ హిందువుల జీవితాలను, వారి మానవ హక్కులను పట్టించుకోలేదు.