Home News VIDEO: యావజ్జీవితం సంఘసేవకు అంకితం సంగెం లక్ష్మీబాయమ్మ

VIDEO: యావజ్జీవితం సంఘసేవకు అంకితం సంగెం లక్ష్మీబాయమ్మ

0
SHARE

1927, 1928 మధ్య కాలంలో పాఠశాలలో చదువుతున్నప్పుడు సైమన్ గో బ్యాక్ ఆందోళనలో సంగెం లక్ష్మీబాయమ్మగారు పాల్గొన్నారు. 1930లో గాంధీ పిలుపునకు స్పందించి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. 1932లో శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొని ఏడాది జైలు శిక్షను ఆమె అనుభవించారు.

నిజాం పాలనకు వ్యతిరేకంగా ఆరంభమైన జాయిన్ ఇండియా మూవ్‌మెంట్‌ను ఆమె ముందు ఉండి నడిపించారు. బూర్గుల రామకృష్ణరావు గారి కేబినెట్‌లో డిప్యూటీ విద్యా శాఖ మంత్రిగా 1954 నుంచి 1956 వరకు బాధ్యతలు నిర్వర్తించారు. విద్యా మంత్రిగా తెలంగాణ జిల్లాల్లో బాలికల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు, కళాశాలల ఏర్పాటుకు సంగెం లక్ష్మీబాయమ్మగారు శ్రీకారం చుట్టారు.