Home News వినుర భారతీయ వీర చరిత

వినుర భారతీయ వీర చరిత

0
SHARE

కొఠారి సోదరులు

కదిలినారయోధ్య కరసేవకులుజూడు
మరక తీసివేసి మందిరమును
కోరి ప్రాణమిచ్చె కొమిరె కొఠారిలు
వినుర భారతీయ వీర చరిత

భావము

శ్రీరామజన్మభూమి అయోధ్యలో మందిరంపై గుమ్మటాలను నిర్మించి మసీదుగా మార్చిన మరకను తుడిచి వేయడానికి దేశమంతటా కరసేవకులు కదలినారు. అందులో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కోల్‌కతా నగరానికి చెందిన రామ్ కుమార్ కొఠారి, శరద్ కుమార్ కొఠారి అనే సోదరులు ముందు వరుసలో నిలిచినారు. ఆ కళంకాన్ని తొలగించారు. దాన్ని భరించలేని అప్పటి ప్రభుత్వం కఠారి సోదరులపై కాల్పులు జరిపింది. వారిని పొట్టనపెట్టుకుంది. ఇలా స్వాభిమాన సంకేతమైన రామచంద్రుని ఆలయం కోసం ప్రాణమిచ్చిన కొఠారి సోదరుల వీర చరిత విను ఓ భారతీయుడా!

రాంనరేష్