
తెలుగు రాష్ట్రాల్లో అంబరాన్ని తాకేలా జరుపుకునే పెద్ద పండుగ సంక్రాంతి. ఈ సంక్రాంతి నెలలో మనకు కనిపించే గొప్ప సంప్రదాయాల్లో ఒకటి హరిదాసు గానం. తెలతెలవారుతూనే ప్రత్యక్షమయ్యే హరిదాసులు హరిలో రంగ హరి.. అంటూ తలపై అక్షయపాత్ర, ఒక చేతితో చిడతలు, మరో చేత్తో తంబూరా మీటుతూ భగవన్నామ స్మరణ చేస్తూ గ్రామ వీధుల్లో సంచరిస్తారు.