Home News సామాజిక స‌మ‌ర‌స‌తా వేదిక ఆధ్వ‌ర్యంలో సంత్ ర‌విదాస్ జ‌యంతి

సామాజిక స‌మ‌ర‌స‌తా వేదిక ఆధ్వ‌ర్యంలో సంత్ ర‌విదాస్ జ‌యంతి

0
SHARE

సంత్ రవిదాస్ జయంతి పురస్కరించుకుని సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ఫిబ్రవరి 4న‌ దిల్ సుఖనగర్ బాగ్ లో ఘ‌నంగా కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు సంబంధించిన పెద్దలు పాల్గొన్నారు.

ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌రైన తెలంగాణ ప్రాంత సామాజిక సమరసత ప్రముఖ్ శ్రీ అప్పాల ప్రసాద్ గారు ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ “చెప్పులు కుట్టే చమర్ కులంలో మాఘ పౌర్ణమి కాశీ వద్ద సీర్ గోవర్ధన పురంలో జన్మించి, బాల్యం నుండే భక్తుడై, బ్రాహ్మణుడు అయిన రామానందుడి శిష్యుడై, కృష్ణ భక్తురాలు మీరాబాయి, చిత్తోడ్ రాణి, కాశీ రాజులకు గురువై, కబీర్ సమకాలికుడై, నిర్గుణ భక్తిలో మునిగిన సంత్ శిరోమణి రవిదాస్ మహారాజ్ ప్రవచించిన ఈ క్రింది సూక్తులు అందరికి మార్గదర్శకాలు అవుతాయి. అని పేర్కొన్నారు.

1.”రామ నామంతో నిండిన మనసులో, రాముడే నివసిస్తాడు. ఆ నామం లో అద్భుతమైన శక్తి దాగి వుంది. ఆ శక్తికి క్రోధం, కోరికలు కూడా దగ్ధమవుతాయి”.
2. “జన్మతో ఉచ్చ, నీచ భావాలు జనించవు. చేసే పనులతోనే అవి ఏర్పడుతాయి.”
3. “ఫలితాలు ఆశించకుండా పనులు చెయ్. అలా చేయటం మాత్రమే నీ ధర్మం “.
4. మనుష్యులను కులాలుగా చూస్తూ రంధ్రాన్వేషణ చేస్తూ పోతే, పొందే లాభం ఏమీ లేదు. చివరికి మానవత్వం కనుమరుగయ్యే అవకాశం ఉంటుంది “.
5.హరి నామాన్ని వదలి కొందరు అటూ ఇటూ వ్యర్థంగా తిరుగుతూ ఉంటే, వారికీ నరకం ఖాయం.”
6. “అతి గర్వం గల మనుష్యునికి భగవంతుడు లభించడు. ”
7. “స్థాయి, హోదా లో ఉన్నంత మాత్రాన పూజించవద్దు. సద్గుణాలు కలిగి ఉంటేనే ఆరాధించాలి.”
8. “మనసు పవిత్రంగా ఉంటే, గంగ నీరు కూడా మన లొంద లోకి తానంతట అదే వస్తుంది ”
9. నాలుకతో ఓంకారం జపిస్తూ, చేతులతో పనులు చేస్తూ పోతే, భగవంతుడు ఇంటికి వచ్చి దర్శనం ఇస్తాడు.
10. మనిషి స్వతంత్ర భావాలతో, మంచి ఆలోచన లతో జీవించాలి ”
11. నిర్మలమైన జ్ఞానం అందించే ప్రాచీన ఉత్తమ వేద ధర్మాన్ని, సత్య వాక్యాలను వదలిపెట్టి, నేనెందుకు ఖురాన్ చదవాలి “?
12. కస్తూరి మృగం తన వద్ద ఉన్న కస్తూరి సుగంధాన్ని తెలియనట్లుగా, అజ్ఞానులు కూడా తమలోని చైతన్యం తెలుసుకోవటం లేదు.”
13. “ఈ శరీరం అనే భౌతిక వస్తువు ఆధారంగా లోపలి సత్యాన్ని గ్రహించాలి ”
14. “సమరసత, సోదర భావం ఆధారంగానే ఈ విశ్వ రచన జరిగింది.
15. “సంపూర్ణ సమాజాన్ని ప్రేమతో అక్కున చేర్చుకుందాం ” అని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాననీయ బాగ్ సంఘచాలక్ శ్రీ దయానంద్ గారు, మోచి సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ భాస్కర్ గారు, ఈశ్వరప్ప గారు తదితర పెద్దలు పాల్గొన్నారు.