
ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడి వీరమరణం పొందిన సంథాల్ వీరులు సిద్దో, కాన్హాలు. వీరిద్దరూ కూడా సంథాల్ పరిగణకి చెందిన సాహెబ్ గంజ్ జిల్లాలోని భోగనాడిహ్ అనే గ్రామంలో జన్మించారు.. వీరి తండ్రిపేరు చున్నుమాంజీ ముర్ము. కేవలం సిద్దో, కాన్హోనే కాకుండా ఛాంద్, భైరవ్ తో కలిసి మొత్తం నలుగురు వీరు. వీరందరూ కూడా పరాక్రమానికి పెట్టింది పేరు.