Home News చరిత్రలో నిలిచిన యుద్ధం సారగర్హి

చరిత్రలో నిలిచిన యుద్ధం సారగర్హి

0
SHARE
గ్రీక్ సపర్త, పర్షియన్ లాంటి యుద్దాల గురించి చాలామందికి తెలుసు కానీ, మన దేశ చరిత్రలో కూడా ఎన్నో వీరోచితమైన పోరాటాలు జరిగాయి. చరిత్రలో నిలిచిపోయిన కొన్ని యుద్ద నేపథ్యాలు తెలిస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అలాంటి వాటిలో మన చరిత్ర చెప్పని గొప్ప యుద్దం సిక్లాండ్ లో జరిగిన సరాగర్హి. ప్రపంచంలోని ఐదు గొప్ప యుద్ధాల్లో ఒకటిగా ఖ్యాతిగాంచింది. ఒకవైపు 10వేలకు పైగా ఆఫ్ఘని దొంగలు, మరోవైపు కేవలం 21మంది సిక్కు యోధులు వీరిమధ్య జరిగిన పోరాటం ఒళ్లు గగురు పొడిచేంతగా నడిచింది.
బ్రిటిష్ వారి హయాంలో ఇండియా, పాకిస్థాన్ కలిసి ఉన్నపుడు పాకిస్థాన్‌లోని కోహటి జిల్లాలోని ఒక చిన్న గ్రామమే సరాగర్హి. తిరుగుబాటుదారులైన ఆఫ్ఘన్ల నుంచి దాడులు ఎదుర్కున్నప్పటికీ బ్రిటిష్ వారు ఖైబర్ పఖున్వా ప్రాంతంపై నియంత్రణ సాధించడంలో విజ‌యం సాధించారు. ఈ సమయంలో నార్త్ వెస్టర్న్ రీజియన్లో బ్రిటిష్ ఇండియన్ ఆర్మీకి హెడ్ క్వార్టర్లుగా సేవలందించిన గులిస్తాన్, లోఖార్ట్ కోటల మ‌ధ్య సారగర్హి గ్రామం కమ్యూనికేషన్ సెంటర్ గా వ్యవహరించింది. ఈ రెండు కోటలు కూడా దగ్గరగా ఉన్నప్పటికీ ఒకదానికొకటి కనిపించవు. ఈ రెండు కోటలను కూడా మహారాజా రంజిత్ సింగ్ నిర్మించారు.
1897 ఆగస్టు 27నుంచి సెప్టెంబర్ 11 వరకు కూడా ఆప్ఘన్లు ఈ రెంటు కోటలపై దాడిచేసేందుకు ప్రయత్నించారు. కానీ అక్కడ ఉన్న 36వ సిక్కు రెజిమెంట్ ప్రతిసారి వారి ప్రయత్నాలను తిప్పికొట్టింది. అది సరాగర్హి ప్రాంతంలో ఉన్న కమ్యునికేషన్ వల్ల సాధ్యమైంది. ఈ క్రమంలో ఈ రెండు కోటల మధ్య ఉన్న కమ్యునికేషన్ ను దెబ్బతీసేందుకు దాదాపు 10వేలమంది ఆప్ఘన్లు సెప్టెంబర్ 12, 1897న సరాగర్ పై దాడి చేశారు. ఆ సమయంలో సరాగర్హిలో 36వ సిక్కు రెజిమెంట్‌కు చెందిన 21 మంది సైనికులు ఉన్నారు. ఈ సైనికులందరూ మజా ప్రాంతానికి చెందినవారు. సిక్కు రెజిమెంట్ లీడర్ హవల్దార్ ఇషార్ సింగ్ నాయకత్వంలో ఈ 21 మంది సైనికులు నియమించబడ్డారు. కోటను ఆక్రమించుకోవడానికి వచ్చిన 10 వేల మందిని చూసి ఈ సిక్కు యోధులు భయపడలేదు.. వారిని నుంచి కోటను ఎలా రక్షించుకోవాలా అని ఆలోచించారు. అసాధ్యమైన సరే తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఇషార్ సింగ్ నాయకత్వంలో 12 సెప్టెంబర్ 1817 న సిక్లాండ్ గడ్డపై గొప్ప యుద్ధం చేశారు.
ఈ యుద్ధంలో 1400 మంది ఆఫ్ఘనిస్తానీలు మరణించారు. సిక్కుల చేతిలో ఆఫ్ఘన్లు ఓడిపోయారు. ఈ వార్త బిటిష్ అధికారుల ద్వారా ఐరోపా ఖండానికి చేరుకుని, ప్రపంచం మొత్తం తెలిసింది. 21 మంది సిక్కు యోధుల పోరాటానికి ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఏకంగా యూకే పార్లమెంటులో ఈ 21 మంది హీరోల ధైర్య సాహసాల‌ను ప్రశంసిస్తూ.. జయధ్వానాలు వినిపించారు. పోరాటంలో మరణించిన సిక్కు యోధ‌/ల‌కు ఘన నివాల‌ర్పించారు. సిక్కు యోధుల పేర్లతో ఒక స్మారక ఫలకాన్ని ఏర్పాటు చేశారు. భారత ప్రభుత్వం చొరవతోనే ఈ 36వ సిక్కు రెజిమెంట్ టీమ్ జ్ఞాప‌క‌ర్థంగా శిలాఫలకం ఏర్పాటు చేయబడింది.
అప్పట్లోనే ఈ యుద్ధంలో మరణించిన వీరులకు మరణానంతరం ఇండియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రదానం చేశారు. నేటి పరం వీర చక్రానికి సమానం. వారి వీరోచిత పోరాటాన్ని వివరిస్తూ చుహర్ సింగ్ అనే కవి ఖల్సా బహదూర్ అనే పేరుతో పద్యాన్ని రాశారు. పంజాబీలో రాసిన ఈ పద్యం 55 పేజీలు ఉంటుంది. వీరి జ్ఞాప‌కార్థం బ్రిటిషర్లు అమృత్ స‌ర్ లోని స్వర్ణ దేవాలయం సమీపంలోనూ, ఈ సైనికుల సొంత జిల్లాలోని ఫిరోజ్ పూర్ కంటోన్మెంట్ లోనూ గురుద్వారాను నిర్మించారు. భారత సైనిక చరిత్రలో యుద్ధ సమయంలో సైనికులు తీసుకున్న అత్యంత విచిత్రమైన తుది నిర్ణయంగా ప్రసిద్ధి గాంచింది ఇది. కేవలం 21 మందితో హవల్దార్ ఇషార్ సింగ్ అన్ని వేల మంది దాడిని ఎలా తిప్పి కొట్టార‌న్న విషయం గురించి మనదేశ పాఠ్యాంశాలలో లేనప్పటికీ ఇప్పటికీ ఫ్రాన్స్ లో పాఠంగా చదువుకుంటున్నారు. ఈ సిక్కు సైనికుల త్యాగాలకు గౌరవసూచకంగా ప్రతిసంవత్సరం సెప్టెంబర్ 12ను సరాగర్హి రోజుగా జరుపుకుంటున్నాం. దీన్ని సిక్కు సైనిక స్మారక దినంగానూ పిలుస్తుంటాం.