వసంత పంచమి సందర్భంగా రాజస్థాన్ ప్రాంతంలోని జోధపూర్ కు దగ్గరలో ఉన్న ఓషియా గ్రామంలో జ్ఞాన దేవత సరస్వతీ మాత పూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సామాజిక సమరసత అఖిల భారత కన్వీనర్ శ్యాంప్రసాద్ గారు పాల్గొని విద్యార్థులతో మాట్లాడారు. జ్ఞాన ఋషులు డా.అబ్దులు కలాం, డా.అంబేడ్కర్ ల జీవిత చరిత్రలు తెలియజేశారు. విద్యార్థులు కూడా సరస్వతీ పూజ చేసి ఆ జ్ఞానదేవత ఆశీర్వాదం ఉండాలని కోరుకున్నారు. అనంతరం విద్యార్థులు నేర్చుకున్న దేశ భక్తి గీతాలను వారు పాడి వినిపించారు.
3 నుండి 14 సంవత్సరాల వయస్సు గల 30 మంది బాలలు ఉన్న వసతి గృహం. అందరూ కరోనా సమయంలో తల్లి తండ్రులను కోల్పోయిన వారే! వీరి కోసం 4సం.ల క్రితం ఒక వసతి గృహం ప్రారంభమైంది. కరోనా పేరున ప్రకృతి విసిరిన సవాలుకు కొందరు ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తల సమాధానమే ఈ వసతి గృహం. ఈ వసతి గృహాన్ని ఒసియన్ రెడీ ఫౌండేషన్ నిర్వహిస్తోంది. డా.రవి ప్రకాష్ ప్రధాన సంచాలకులుగా ఉన్నారు.