Home News “విద్యకు విముక్తి” పుస్త‌క ఆవిష్క‌ర‌ణ

“విద్యకు విముక్తి” పుస్త‌క ఆవిష్క‌ర‌ణ

0
SHARE

శ్రీ తంగేడుకుంటా హెబ్బార్ నాగేశ్వరరావు గారు ర‌చించిన, సంవిత్ ప్రకాన్ వారు ప్ర‌చురిస్తున్న “విద్యకు విముక్తి” అనే పుస్త‌కాన్ని భాగ్య‌న‌గ‌ర్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో జ‌రుగుతున్న నేషనల్ బుక్ ఫేర్ లో ఫిబ్ర‌వ‌రి 14న సాయంత్రం ఆవిష్క‌రించారు.

ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా హాజరైన మాజీ ఐఎఎస్ అధికారి చామర్తి ఉమామహేశ్వరరావు గారు మాట్లాడుతూ కార్య-శాసన-న్యాయ వ్యవస్థల మాదిరిగా విద్యకు స్వ‌యం ప్రతిపత్తి కల్పించాల‌న్నారు. జాతీయ పునర్ నిర్మాణం కోసం ప్రాథమిక విద్యా స్థాయిలో భారతీయ భాషల ఉన్నత విద్య స్థాయిలో సంస్కృత భాష ద్వారా బోధన జరగాలన్నారు.

పుస్తక రచయిత హెబ్బార్ నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ విలువలతో కూడిన విద్యను పొందడానికి ప్రజలు కూడా ప్రయత్నించాలని, అందుకు తగిన వాతావరణాన్ని నిర్మించుకోవాలని, మాతృభాషలో విద్యాభ్యాసం మొదటి అడుగని అన్నారు.

పుస్తకాన్ని పరిచయం చేసిన బొప్పా భాస్కర్ గారు మాట్లాడుతూ ప్రతి ఉపాధ్యాయుడు విద్యావంతుడు మేధావి వివిధ రంగాల్లో ఉన్న ప్రముఖులు ఈ పుస్తకం కచ్చితంగా చదవాలి భారతీయ విద్యా విధానపు ప్రాముఖ్యత తెలుసుకోవాలని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో సంవిత్ ప్రకాశన్ డైరెక్టర్లు శైలజ, పరిమళ, విద్యాధర్ లతోపాటు పలువురు పాల్గొన్నారు.