
రాంజీ గోండు
నిర్మలు నగరమున నీచ నిజాముతో
రాంజి గోండు నాడు రణమొనర్చ
వేయి మంది యురిని వేయబడిరిచట
వినుర భారతీయ వీర చరిత
భావము
ప్రథమ స్వాతంత్ర్య సమరంలో నైజాం సేనను తన అనుచరులతో రాంజీ గోండు భీకరంగా ఎదుర్కొన్నారు. అయితే కపట నీతితో రాంజీ గోండుతో పాటుగా ఆయన అనుచరుల్లో 1,000 మందిని నైజాం సైనికులు, బ్రిటీష్ సైనికులు అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ నిర్మల్ నగరంలో ఒకే మర్రి చెట్టుకు ఉరి వేశారు. తల్లి భారతి స్వేచ్ఛ కోసం తనువులు అర్పించిన ఆ వీరుల చరిత విను ఓ భారతీయుడా!
రాంనరేష్