Home News ఎస్సి రిజర్వేషన్ సమితి: స్వారో ముసుగులో గురుకులాల్లో అరాచకాలు, కార్యదర్శి ప్రవీణ్ ను తొలగించాలి

ఎస్సి రిజర్వేషన్ సమితి: స్వారో ముసుగులో గురుకులాల్లో అరాచకాలు, కార్యదర్శి ప్రవీణ్ ను తొలగించాలి

0
SHARE
  • ప్రవీణ్ ను తొలగించాలి
  • స్వారో ముసుగులో గురుకులాల్లో అరాచకాలు
  • నిందితుడు దామోదర్ కు ప్రవీణ్ కు అండదండలు
  • ఎస్ సి రిజర్వేషన్ సమితి ఆరోపణలు

గురుకులాల్లో స్వారో ముసుగులో అసాంఘిక శక్తులను పెంచి పోషిస్తున్న గురుకుల పాఠశాలల కార్యదర్శి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ను వెంటనే తొలగించాలని జాతీయ ఎస్సి రిజర్వేషన్ సమితి డిమాండ్ చేసింది. గౌలిదొడ్డి గురుకుల పాఠశాలలో ఇటీవల తొమ్మిదో తరగతి బాలిక పై అత్యాచార యత్నం చేసిన ప్రిన్సిపల్ ప్రమోద భర్త దామోదర్ కు ప్రవీణ్ నుంచి పూర్తి అండదండలు ఉన్నాయని ఆరోపించింది. ప్రవీణ్ కు గురుకులంలో ఫ్యాకల్టి గా పని చేస్తున్న దామోదర్ అత్యంత సన్నిహితుడని సమితి అద్యక్షుడు కర్నే శ్రీశైలం అన్నారు.

ప్రవీణ్ సహకారంతోనే దామోదర్ తన భార్య ప్రమోధకు గౌలి దొడ్డి లో పోస్టింగ్ ఇప్పించ గలిగాడని పేర్కొన్నారు. 9 వ తరగతి బాలికలపై దామోదర్ లైంగిక దాడికి పాల్పడుతున్నాడని అతడిని వెంటనే అరెస్ట్ చేయాలనీ డిమాండ్ చేసారు. గౌలిదొడ్డి గురుకుల పాటశాల లైంగిక వేదింపుల ఘటనకు నిరసనగా శనివారం లోయర్ ట్యాంక్ బండ్ లోని బి ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జాతీయ ఎస్సి రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఆందోళన నిర్వహించింది. పెద్ద ఎత్తున పాల్గొన్న కార్యకర్తలు..నోటికి నల్ల రిబ్బన్ కట్టుకొని నిరసన వ్యక్తం చేసారు.

ఈ సందర్బంగా సమితి అధ్యక్షుడు శ్రీశైలం మాట్లాడారు. దామోదర్ దాష్టీకం పై పోలీసులు భాదిత బాలిక తండ్రి ఫిర్యాదు చేసి 25 రోజులు గడుస్తున్న పోలీసుల చర్యలు తీసుకోక పోవడం దారుణమన్నారు. రాష్ట్రంలోని సంఘీక సంక్షేమ గురుకులాల్లో కొంత కాలంగా స్వారో ముసుగులో అమ్మాయిల పై అత్యాచారాలు జరుగుతున్నాయని..వాటిని నిరిధించడం లో గురుకుల పాటశాల యంత్రాంగం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.

గత నెలలో ఆదిలాబాద్ లో సంఘీక సంక్షేమ గురుకులంలో ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థినిని క్యాటరింగ్ కంట్రాక్టర్ గా పని చేస్తున్న కూన రవి కిడ్నాప్ చేసి తన ఇంట్లో 36 గంటలు నిర్బందించి వేదించారన్నారు..అయన స్వారో సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారని, పోలీసులు అతడిపై నామ మాత్రంగా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకున్నరని ఆరోపించారు. గురుకులాల్లో స్వారోను నిషేధించాలని , గురుకులాల్లో అక్రమాలు, అవినీతికు పాల్పడుతున్న ఆ సంస్థ పై సి బి ఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దామోదర్ అరెస్ట్ చేసేంతవరకు తమ పోరాటం ఆగదన్నారు.

దామోదర్ లైంగిక వేధింపులకు గురి చెసిన అతని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర డి జి పి అయినా మహెందర్ రెడ్డి గారికి వినతి పత్రం సైతం అందచేసారు.

(ఆంధ్రజ్యోతి సౌజన్యం తో)