మాజీ కేరళ డిజిపి జాకబ్ థామస్, కొచ్చిలో జరిగిన ఆర్.ఎస్.ఎస్ ఐటి మిలన్ గురు దక్షిణ కార్యక్రమానికి హాజరయ్యారు, అందరూ స్వయంసేవకుల మాదిరిగానే ఆయన కూడా ప్రణామ్ స్థితిలో సంఘ ప్రార్ధన చేశారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఆయన ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్చంద సంస్థగా ఆర్ఎస్ఎస్ అద్భుతాలు చేస్తోందని, ఇంత గొప్ప పనులు చేస్తున్నప్పటికీ ఆర్.ఎస్.ఎస్ సభ్యులు నిశ్శబ్దంగా,మీడియా, కీర్తిలకు నుండి దూరంగా ఉంటారని. ఈ నిస్వార్థ సేవాభావమే తనను సంస్థ వైపు ఆకర్షించిందని అన్నారు.
ఆర్.ఎస్.ఎస్ పట్ల కేరళ ప్రభుత్వానికి ఉన్న శత్రుత్వాన్ని ఆయన తప్పుపట్టారు. ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తలకు పోలీసు అధికారులు సమాచారం అందించడంలో తప్పేమిటని, ఆ సమాచారం ప్రజలందరికీ సంబంధించినది కనుక అలా చేయడంలో ప్రమాదమేమి లేదని ఆయన అన్నారు. ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు ప్రజానీకంలో భాగం కాదా అని ఆయన ప్రశ్నించారు. ఆర్.ఎ.స్‌ఎస్‌తో తమకున్న సాన్నిహిత్యం గురించి మాట్లాడటానికి కేరళలో చాలా మంది భయపడుతున్నారని ఆయన అన్నారు. పాశ్చాత్య సంస్కృతి మోజులో భారతీయ సంస్కృతిని మరచిపోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కార్యక్రమం తరువాత మీడియాతో మాట్లాడిన ఆయన దేశ సేవ కోసం సివిల్ సర్వీసులో చేరానని, దేశానికి సేవ చేసే ఏ సంస్థతోనైనా పనిచేయడం సంతోషంగా ఉంటుందని అన్నారు. అందువల్ల ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమానికి హాజరుకావడంలో తనకు ఎలాంటి సంకోచాలు లేవని చెప్పారు
శబరిమల సమస్య గురించి కూడా మాట్లాడుతూ ఏదైనా విధానం ప్రజల నమ్మకాలు, సంప్రదాయాలకు విరుద్ధంగా ఉంటే చట్టాలను రూపొందించేవారు, కార్యనిర్వాహణ అధికారులు ఆ విషయాన్ని గుర్తించి ప్రజలకు, దేశ సంక్షేమానికి ఉపయోగపడే విధానాలను సిద్ధం చేయాలి. ఏదైనా విధానంలోని తప్పులను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం ప్రతి పౌరుడి కర్తవ్యం అని ఆయన అన్నారు.
తాను గత సంవత్సరం శబరిమల వెళ్ళానని, కుంభమేళాను కూడా సందర్శించానని, అలాంటి యాత్రల కోసం ఇప్పుడు తనకు ఎక్కువ సమయం దొరికిందని జాకబ్ థామస్ చెప్పారు.
– వి.ఎస్.కె భారత్ సౌజన్యం తో