Home News నాగ్‌పూర్‌లో ప్రారంభమైన రాష్ట్ర సేవికా సమితి అఖిల భారతీయ కార్యకారిణి, ప్రతినిధి సభ బైఠక్...

నాగ్‌పూర్‌లో ప్రారంభమైన రాష్ట్ర సేవికా సమితి అఖిల భారతీయ కార్యకారిణి, ప్రతినిధి సభ బైఠక్ లు

0
SHARE

రాష్ట్ర సేవిక సమితి అఖిల భారతీయ కార్యకారిణి, ప్రతినిధి సభ బైఠక్ లు నాగ్‌పూర్  రేషింబాగ్ లోని  స్మృతి మందిర్ ప్రాంగణంలో ప్రారంభమయ్యాయి. 22 జూలై 2019 తో ముగియనున్న ఈ బైఠక్‌ లలో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి 261 కార్యకర్తలు పాల్గొంటున్నారు.

ప్రకృతి వైపరీత్యాలకు బలైన  అమాయక బాధితులకు, వీర సైనికులకు, అలాగే దేశహితం కోసం తమ వంతు కృషి చేసిన  ప్రతి ఒక్కరికి వందనీయ ప్రముఖ సంచాలిక, మాననీయ శాంతక్క  శ్రద్ధాంజలిని ఘటించారు. భారత్  అద్భుతమైన భవిష్యత్తు దర్శించిన స్వామి సత్యమిత్రానంద గిరిజి మహారాజ్ కు ఆమె ప్రత్యేక నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన రాష్ట్ర సేవికా సమితి ప్రముఖ కార్యవాహిక సీతా గాయత్రి నేటి కుహనా లౌకికవాదుల తప్పుడు ప్రచారంపై మన  అప్రకటిత మేధో యుద్ధంలో విజయవంతం సాధించడానికి మాత అదితిని  స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు.  `స్వధర్మే స్థిరతాం – స్థైర్యం – ఇంద్రియనిగ్రహః’ అనే బైఠక్ ధ్యేయ వాక్యాన్నిమనసులో పెట్టుకుంటూ సేవికలు స్వధర్మ, సేవికా ధర్మాల మార్గాన్ని అత్యంత శ్రద్ధతో అనుసరించాలని ఆమె కోరారు. సత్ప్రవర్తనే మన శరీరం, మనస్సు, ఆత్మను స్థిరీకరిస్తుందని, ఇది మనకు మరింత ధైర్యాన్ని, విజయాన్ని ఇస్తుందని అన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు, సమిష్టిగా ఆలోచించేందుకు ఇక్కడ సమావేశమయ్యామని  వివరించారు.

దేశవ్యాప్తంగా నిర్వహించిన వార్షిక శిక్షణా శిబిరాల్లో 9452 సేవికలు శిక్షణ పొందారు. అలాగే  2399 శాఖలు, 958 సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. గత సంవత్సర కార్యకలాపాలను సమీక్షించుకుని, మరింత ఉత్సాహంతో భవిష్యత్తు ప్రణాళిక తయారుచేసుకోవాలని ప్రముఖ కార్యవాహికా సీత గాయత్రి ముగించారు.