Home News సంగారెడ్డి: సేవాభార‌తి ఆధ్వ‌ర్యంలో కోవిడ్ ఐసోలేష‌న్ కేంద్రం ఏర్పాటు

సంగారెడ్డి: సేవాభార‌తి ఆధ్వ‌ర్యంలో కోవిడ్ ఐసోలేష‌న్ కేంద్రం ఏర్పాటు

0
SHARE

సంగారెడ్డి పరిసర ప్రాంతాలకు చెంది, కొవిడ్ (కరోనా) పాజిటివ్ తో ఇంట్లో ఐసొలేషన్ వసతి సౌకర్యం లేని లేదా పేద వారికోసం సేవాభారతి సంగారెడ్డి ఆధ్వర్యంలో 10రోజుల క్రితం సంగారెడ్డి శివారులోని శ్రీ సరస్వతీ శిశుమందిర్ లో కరోనా ఐసొలేషన్ కేంద్రం  ఏర్పాటు చేశారు.

ప్రస్తుతం ఈ కేంద్రం లో 20 మంది కరోనా వ్యాధి గ్రస్తులు ఆశ్రయం పొందుతున్నారు. వీరికి మూడు పూటలా బలవర్ధకమైన పౌష్టికాహారంతో పాటు కషాయం, పాలు, పండ్లు అందిస్తున్నారు.

ఉదయం, సాయంత్రం యోగాసనాలు, ప్రాణాయామ శ్వాస క్రియలు మరియు మానసికంగా ఒత్తిడి కి లోను కాకుండా ఉల్లాసంగా ఉండడానికి ఆధ్యాత్మికమైన మంచి మాటలు, కథలు , పాటలు , నృత్యం తో భజనలు నిర్వ‌హిస్తున్నారు.

రోజుకు మూడు సార్లు అందరి ఆరోగ్య పరిస్థితి (టెంపరేచర్, ఆక్సిజన్ లెవెల్స్, పల్స్ ) పరీక్షిస్తూ డాక్టర్ గారి పర్యవేక్షణ లో ఆరోగ్య సూచనలు ఇస్తున్నారు. ఐసొలేషన్ కేంద్రాన్ని ఎల్లప్పుడూ శానిటైజ్ చేస్తూ ప‌రిశుభ్ర‌త పాటిస్తున్నారు. ఇప్పటికి నలుగురి ఆరోగ్యం కోలుకొని సంతోషంగా వారి ఇళ్లకు వెళ్లార‌ని ఐసొలేషన్ సెంటర్ నిర్వాహకులు తెలిపారు.

ప్రకృతి విపత్కర పరిస్థితుల్లో “సేవా భారతి” కార్యకర్తలు ఎల్లప్పుడూ ముందు ఉండి సమాజ హితం కోసం త్యాగ నిరతితో కార్యక్రమాలు నిర్వహిస్తారని సేవా భారతి కార్యకారిణి తెలిపారు.

మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నంబర్లు :
అంబరీష్ అవుడం : 94410 38729
నారాయణఖేడ్ వీరారెడ్డి: 9490221753